Advertisement
Google Ads BL

హడావిడి లేకుండా ఈ అప్ డేట్ ఏంటి పవన్


ఉగాదికి పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలయికలో రీసెంట్ గా మొదలైన PKSDT నుండి అప్ డేట్ రాబోతుంది.. అందులో ఫస్ట్ లుక్ అలాగే రిలీజ్ డేట్ కానీ వస్తుంది అని పవన్ ఫాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసారు. కానీ మేకర్స్ నుండి PKSDT నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దానితో పవన్ ఫాన్స్ ఏమి డిస్పాయింట్ అవ్వలేదు కానీ.. వస్తే బావుంటుంది అనుకున్నారు. కానీ ఉగాది ఇవ్వకపోతేనేమి.. రెండు రోజులు ఆలస్యంగా PKSDT నుండి అప్ డేట్ ఇచ్చారు. అది కూడా సైలెంట్ గా.

Advertisement
CJ Advs

సముద్ర ఖని దర్శకత్వంలో రీసెంట్ గా మొదలైన తమిళ హిట్ మూవీ వినోదియం సిత్తం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. ఆయన మేనల్లుడు సాయి తేజ్ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మార్చ్ మొదటి వారంలోనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో యమా స్పీడుగా జరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ చకచకా 22 రోజుల షూటింగ్ ఎపిసోడ్ ని పూర్తి చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ కామ్ గా ప్రకటించేసారు. 

#PKSDT storming in theatres from 2️⃣8️⃣th July 2023🌀 Bombarding updates on the way💥 PKSDT జులై 28 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానితో పవన్ ఫాన్స్ షాకవుతున్నారు. ఇంత త్వరగా పవన్ మూవీ రిలీజ్ అవడమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నట్లుగా  తెలుస్తుంది. సాయి తేజ్ కి జోడిగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

PKSDT releasing on July 28th:

PKSDT releasing on July 28th 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs