జబర్దస్త్ లో గురువారం ఎపిసోడ్ నుండి అందమైన అనసూయ తప్పుకోగానే ఆ సీట్ లోకి సీరియల్ నటి సౌమ్య రావు వచ్చి చేరింది. కొత్త యాంకర్ సౌమ్య రానప్పుడు యాంకర్ రష్మీ కొన్నాళ్ళు శుక్రవారం ఎపిసోడ్ తో పాటుగా గురువారం కూడా కవర్ చేసింది. కానీ సౌమ్య రావు రాకతో గురువారం కొత్త యాంకర్ గా సౌమ్య, శుక్రవారం రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు చూసుకుంటున్నారు. అయితే ఈరోజు శుక్రవారం ఎపిసోడ్ లోకి ధమ్కీ స్టార్ విశ్వక్ సేన్, ప్రసన్న కుమార్ వచ్చారు.
ధమ్కీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ వాళ్ళు జబర్దస్త్ లో స్కిట్ కూడా చేసి కడుపుబ్బా నవ్వించారు. ఇక కెవ్వు కార్తీక్ టీమ్ లోకి గెస్ట్ గా వచ్చిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు కి రెండు కుర్చీలు చూపించి కార్తీక్ ఏ కుర్చీలో కూర్చుంటారు అని అడగ్గానే.. సౌమ్య నాకు ఈ రెండు చైర్స్ వద్దు, నాకు ఆ చైర్ కావాలంటూ రష్మీ కూర్చున్న సోఫా చూపించగానే రష్మీ షాకవుతుంది.
ఆ స్కిట్ చూసాక హమ్మ సౌమ్య గురువారం మాత్రమే కాదు.. శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ సీట్ కూడా రష్మీ నుండి లాగేసుకుందామనే అంటూ నెటిజెన్స్ సౌమ్య రావు ని సరదాగా అటు పట్టిస్తున్నారు.