Advertisement
Google Ads BL

మనోజ్ vs విష్ణు: మోహన్ బాబు సీరియస్


ప్రస్తుతం ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ హైలెట్ అవుతుంది. అది మంచు అన్నదమ్ముల మధ్యన విభేదాలు రచ్చకెక్కాయని. మంచు మనోజ్ vs మంచు విష్ణు అన్న రేంజ్ లో వారి మధ్యన విభేదాలు సోషల్ మీడియా సాక్షిగా భగ్గుమన్నాయి. ఒకరికొకరు కొట్టుకోవడమే తక్కువ అన్నట్టుగా మంచు మనోజ్, విష్ణుల మధ్యన గొడవలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. మంచు విష్ణు తన అనుచరులు, బంధువుల ఇళ్లపైకి వచ్చి కొడతాడంటూ.. తనకి కావల్సిన సారధి ఇంట్లో చొరబడి విష్ణు గొడవపడుతున్న దృశ్యాలను మనోజ్ షూట్ చేసి సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టాడు.

Advertisement
CJ Advs

దానితో మంచు విష్ణు-మంచు మనోజ్ ల గొడవ ఇప్పుడు తేటతెల్లమైంది. ఇప్పటివరకు గుట్టుగా ఉన్న మంచు విభేదాలు ఇప్పడు పబ్లిక్ లోకి వచ్చేసాయి. దానితో మంచు మోహన్ బాబు కొడుకులపై సీరియస్ అయ్యి మంచు మనోజ్ పెట్టిన వీడియోని తొలగించమని చెప్పాక.. మనోజ్ ఆ వీడియో డిలీట్ చేసాడని తెలుస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోగా.. ఫిలిం నగర్ లోని మంచు లక్ష్మి ఇంటిదగ్గర జనాలు పోగయ్యారు. అక్కడ ఆమె ఇంటిముందు చాలామంది గుమ్మిగూడి ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో అనే ఆత్రుత అందరిలో కనబడుతుంది. 

ఇక ఈ గొడవపై మంచు మోహన్ బాబు సీరీస్ అవడమే కాదు.. ఈ గొడవ సద్దుమణిగేలా ఆయన చర్యలకి సిద్దమైనట్లుగా తెలుస్తుంది. మోహన్ బాబు ఇద్ద‌రు కొడుకుల‌పై సీరియ‌స్ అవడమే కాకుండా.. కుటుంబంలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌టంపై కూడా ఆయ‌న ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసినట్లుగా తెలుస్తుంది. 

తండ్రి ఆదేశంతో వెంట‌నే మ‌నోజ్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను డిలీట్ చేసాడు. ఫ్యామిలిలో అన్న‌ద‌మ్ములు అన్న త‌ర్వాత చిన్న చిన్న గొడ‌వ‌లుండ‌టం సర్వ సాధారణం, ఆవేశం అన‌ర్థానికి దారి తీస్తుంద‌నే విష‌యాన్ని త‌న కొడుకులు అర్థం చేసుకోలేక‌పోతున్నార‌ని, కాబట్టి వివాదాన్ని పెద్ద‌గా చేయ‌వ‌ద్ద‌ని మోహన్ బాబు మీడియాని కోరారు.

Manoj vs Vishnu: Mohan Babu is serious:

Mohan Babu Serious On Manchu Vishnu And Manoj 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs