Advertisement
Google Ads BL

NTR30-RC15 : శ్రీకాంత్ రోల్స్ రివీల్డ్


ఎన్టీఆర్-కొరటాల కాంబో NTR30 అధికారికంగా మొదలయ్యింది. ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ తో చాలా హుషారుగా ఉన్నారు. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్షణాలు రావడంతో ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో తెలియదు కానీ.. ఫాన్స్ మాత్రం తెగ ఆందోళనపడ్డారు. అయితే ఇప్పుడు సినిమా మొదలు కావడంతో వారు హ్యాపీగా ఉండగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్-శ్రీకాంత్ కీ రోల్స్ పోషిస్తున్నారనేది నిన్న ఓపెనింగ్ డే రోజున రివీల్ అయ్యింది. స్పెషల్ గా వీరిద్దరూ ఓపెనింగ్ కి హాజరయ్యారు.

Advertisement
CJ Advs

దానితో వీరి రోల్స్ పై ఫాన్స్ లో అప్పుడే క్యూరియాసిటీ మొదలయ్యింది. శ్రీకాంత్ ఇప్పుడు NTR30 లో తన రోల్ గురించి అలాగే RC15 లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇద్దరు ఆస్కార్ స్టార్స్ తో ఒకేసారి నటించడం చాలా ఆనందంగా ఉంది.. శంకర్-రామ్ చరణ్ కాంబోలో RC15 లో నటిస్తున్నాను. ఈ చిత్రంలో అవకాశం రావడం నిజంగా షాకింగ్ విషయమే. శంకర్ నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారని దిల్ రాజుని అడిగితే ఈ పాత్ర  నువ్వే చేయాలన్నారు. ఈ సినిమాలో నా పాత్ర రెండు రకాలుగా ఉంటుంది. మిడిల్ ఏజ్, పెద్దాయన క్యారెక్టర్లు నేను వేశాను. రెండు టైమ్ పీరియడ్లకు సరిపోయేలా ఉండాలని నన్ను తీసుకున్నారు అంటూ శ్రీకాంత్ RC15 లో తన రోల్ గురించి రివీల్ చేశారు.

ఇప్పుడు కొరటాల-ఎన్టీఆర్ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో కూడా శ్రీకాంత్ చెప్పారు. అయితే తన కేరెక్టర్ గురించి సరిగ్గా బయటపెట్టలేదు.. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నా. ఎన్టీఆర్ కాంబినేషన్‌లోనే సినిమా మొత్తం ఉంటా. నా కేరెక్టర్ నెగిటివ్, పాజిటివ్ రెండు రకాలుగా ఉంటుంది. పాత్ర గురించి ఇంతకు మించి చెప్పడం బాగోదు. ఎన్టీఆర్ తో సినిమా చేయడం, శివ దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ శ్రీకాంత్ తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

NTR30-RC15 ​​: Srikanth Roles Revealed:

Srikanth about RC15 and NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs