Advertisement
Google Ads BL

థియేటర్స్ లో ఢమఢమ.. ఓటిటిలో సైలెంట్


దిల్ రాజు నిర్మాణంలో లో బడ్జెట్ తో జబర్దస్త్ వేణు మొదటిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమా థియేటర్స్ సూపర్ హిట్ అయ్యింది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేని ఈ మూవీకి ప్రీమియర్స్ ద్వారా అందరిలో అంచనాలు పెంచడమే కాదు.. దిల్ రాజు తన స్వగ్రామం నిజమాబాద్ లో చేసిన ప్రమోషన్స్, సినిమా విడుదలయ్యాక చేసిన ప్రమోషన్స్, తెలంగాణ నేపథ్యంలో కంటెంట్ బలంగా ఉండడంతో బలగం బంపర్ హిట్ అయ్యింది. థియేటర్స్ లో విడుదలైన బలగం 20 రోజులు గడిచినా దిల్ రాజు ప్రమోషన్స్ వదల్లేదు, వేణు అండ్ ప్రియదర్శి ఈ 20 రోజులుగా బలగం ని ప్రమోట్ చేస్తూనే థియేటర్స్ కి జనాలని రప్పించారు. 20 రోజుల్లో 2 కోట్లతో తెరకెక్కిన బలగం 20 కోట్లు కొల్లగొట్టడం మాములు విషయం కాదు. 

Advertisement
CJ Advs

కేవలం అది దిల్ రాజు చేసిన ప్రమోషన్స్ కారణంగానే జరిగింది. థియేటర్స్ లో సినిమా ఉన్నప్పుడు అంత మోత మోగించిన బలగం టీం.. దానిని ఓటిటిలో గప్ చుప్ గా విడుదల చెయ్యడం చూస్తే విస్తుపోయారు. కనీసం బలగం హీరో ప్రియదర్శికి కూడా ఆ చిత్రం ఓటిటిలో గత అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది అన్న విషయమే తెలియదట. అలాగే మార్చి 24 నుండి అమెజాన్ ప్రైమ్ లో బలగం విడుదలవుతున్న విషయాన్ని అమెజాన్ కూడా పెద్దగా ప్రమోట్ చెయ్యకపోవడం విచిత్రంగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుండి బలగం సైలెంట్ గా ఓటిటిలో ప్రత్యక్షమవడం చాలామందికి షాకిచ్చింది. 

అసలు అమెజాన్ ప్రైమ్ లో వచ్చే మూవీస్ కి ఎప్పుడూ ఎలాంటి హడావిడి ఉండదు. కానీ నెట్ ఫ్లిక్స్ వాళ్ళు అలా కాదు.. రిలీజ్ డేట్ పోస్టర్ తో కాస్త హడావిడి అయినా చేస్తారు. అమెజాన్ వాళ్ళు అలా కాదు.. మొన్నామధ్యన 400 కోట్లు కొల్లగొట్టిన కాంతార విషయంలోనూ అంతే జరిగింది. ఇప్పుడు బలగం కి కూడా అదే పరిస్థితి.

Reason Behind Early OTT Release Of Balagam:

Silently Balagam in OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs