సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న SSMB28 చిత్రం నుండి ఈ ఉగాదికి ఫస్ట్ లుక్ కానీ.. టైటిల్ కానీ రాబోతుంది అంటూ మహేష్ ఫాన్స్ చేసిన రచ్చ మాములుగా లేదు. మహేష్ ని అయోధ్యలో అర్జునిడిగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు, SSMB28 కి అయోధ్యలో అర్జునుడు టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నారు. కానీ మేకర్స్ మహేష్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. టైమ్ ఉంది కంగారు పడకండి.. మాస్ ఫీస్ట్ మహేష్ అంటూ ఏదేదో చెప్పారు.
అయితే ఉగాది మిస్ అయ్యింది.. శ్రీరామనవమికి అంటే మరో వారంలో SSMB28 లుక్ రెడీ అవ్వదు. ఇక ఏప్రిల్ నుండి మే చివరి వరకు అంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి వరకు మహేష్ బాబు-త్రివిక్రమ్ SSMB28 నుండి ఎలాంటి లుక్ కానీ, టైటిల్ కానీ రివీల్ అయ్యే అవకాశం కానీ, అందుకు తగ్గ అద్భుతమైన అకేషన్ కానీ లేవు. కృష్ణ బర్త్ డే కి మహేష్ మూవీస్ నుండి ఏదో ఒక ట్రీట్ ఘట్టమనేని ఫాన్స్ కి ఉంటుంది. సో మహేష్ ఫాన్స్ ఖచ్చితంగా సూపర్ స్టార్ జయంతి వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
ఈలోపు సోషల్ మీడియాలో హడావిడి చేస్తే అది.., మేకర్స్ ని ఇబ్బంది పెట్టడం తప్ప అప్ డేట్ మాత్రం తీసుకోలేరు. ఇక SSMB28 ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే SSMB28 సెట్స్ లోకి హీరోయిన్ పూజ హెగ్డే జాయిన్ అయ్యింది. త్వరలోనే మరో హీరోయిన్ శ్రీలీల కూడా జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిస్తారని తెలుస్తుంది.