గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ గురించే మాట్లాడుకుంటున్నారు. కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రకాష్ రాజ్-బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్, ప్రీమియర్స్ తో హడావిడి చెయ్యడం.. సింగర్స్ దగ్గరనుండి.. సీనియర్ నటుల వరకు రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడడం.. వారికి కృష్ణవంశీ థాంక్స్ చెప్పడం ఇదంతా చూస్తున్నాం. ప్రీమియర్స్ కి వెళ్లి చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి పొగిడేస్తూన్నారు.
అయితే కృష్ణవంశీ రంగమార్తాండ గురించి టాప్ స్టార్స్ ఎవరూ మాట్లాడకపోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. సినిమా చూసి విష్ చెయ్యకపోయినా.. కనీసం ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి కంగ్రాట్స్ చెప్పాల్సిందేమో.. ఆయనేమి చిన్న దర్శకుడు కాదు అనేది నెటిజెన్స్ అభిప్రాయం. ఇక నిన్న థియేటర్స్ లో విడుదలైన చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇలాంటి సినిమాని టాప్ స్టార్స్ కూడా సోషల్ మీడియా ద్వారా కాస్త ట్వీట్స్ చేసి సపోర్ట్ చేస్తే.. సినిమాకి మరింత హెల్ప్ అవుతుంది, ఓ మంచి సినిమాని బ్రతికించినట్టవుతుంది. మరి ఈ విషయంలో కృష్ణవంశీతో పని చేసిన ఏ స్టార్ హీరో అయినా కాస్త ముందడుగు వేస్తారేమో చూడాలి.