Advertisement
Google Ads BL

‘విరూపాక్ష’ టీమ్‌పై ‘సార్’ పాప ఫైర్!


సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరూపాక్ష’. ఇందులో ఇటీవల ‘సార్’ చిత్రంతో హిట్ కొట్టిన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న సంయుక్తా మీనన్.. ఇప్పుడు చేస్తున్న ‘విరూపాక్ష’ నిర్మాణ సంస్థపై ఫైర్ అయింది. అందుకు కారణం తెలిస్తే అంతా షాకవుతారు. ఎందుకంటే.. ఆమె లుక్ రిలీజ్ చేయలేదని.. సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థపై ఫైర్ అవడం.. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ విషయంలో జరగలేదు. మరి ఆమె ధైర్యం ఏమిటో తెలియదు కానీ.. డైరెక్ట్‌గా నిర్మాణ సంస్థనే టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement
CJ Advs

‘‘నేను.. నా నిరుత్సాహాన్ని వ్యక్తం చేసే ముందు.. విరూపాక్ష చిత్రంతో నా జర్నీ మరిచిపోలేనిది. ఈ సినిమా విషయంలో అత్యద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఎస్‌వి‌సిసి బ్యానర్ వారు ఎందుకు అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఈ ఉగాదికి నా పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేస్తామని మాట ఇచ్చారు కదా. మరి ఏది పోస్టర్?’’ అని పోస్ట్ చేసి.. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ పరువు తీసేసింది. 

అయితే సంయుక్తా మీనన్ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. నిర్మాణ సంస్థ ఎస్‌విసిసి కూడా.. ‘అందుకు మా క్షమాపణలు తెలియజేస్తున్నాము.. సరైన సమయం చూసుకుని త్వరలోనే మీ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేస్తాము’ అని తెలిపారు. దీనికి ఆమె కన్ఫ్యూజ్‌డ్ ఎమోజీలతో ఓకే అని బదులిచ్చింది. అయితే ఇదంతా చూసిన కొందరు నెటిజన్లు.. సినిమా ప్రమోషన్స్‌లో ఇదో టెక్నిక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. రెండు హిట్స్ పడ్డాయో లేదో.. ఈ హీరోయిన్‌కి నిర్మాణ సంస్థనే ప్రశ్నించేంత ధైర్యం వచ్చేసింది. నిర్మాతల పరిస్థితి రోజురోజుకీ ఎలా దిగజారిపోతుందనే దానికి ఉదాహరణ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Samyuktha Menon Fires on SVCC Banner:

Heroine Samyuktha Menon Tweet on SVCC Banner goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs