ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయిన క్షణం రానే వచ్చింది. NTR30 ఓపెనింగ్ మార్చ్ 23 అని డేట్ ఇవ్వగానే.. NTR30 ఓపెనింగ్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలవుతుందా.. ఈ ఓపెనింగ్ లో ఎవరెవరు గెస్ట్ లుగా రాబోతున్నారో అనే ఆత్రుత ఎన్టీఆర్ ఫాన్స్ లో కనిపించింది. మార్చ్ 23 ఉదయం 8.30 నిమిషాల నుండి NTR30 లైవ్ ఇవ్వబోతున్నామని మేకర్స్ ఎనౌన్స్ చేసినప్పటినుండి ఆ 8.30 ఎప్పుడవుతుందా అని కూడా వాళ్ళు ఎదురు చూసారు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ విడుదలైన ఆరు నెలలకు అయినా సినిమా మొదలవుతుంది అనుకుంటే అది ఏడాది పూర్తయ్యింది. ఇక అనుకున్న సమయానికి కాకుండా ఒక నెల గ్యాప్ లో మార్చ్ 23 న పూజా కార్యక్రమాలతో NTR30 హైదరాబాద్ లోనే మొదలు కాబోతుంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబో NTR30 పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ ఓపెనింగ్ లో ఆస్కార్ విజేత ఎస్.ఎస్ రాజమౌళి, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత నాగ వంశి, దిల్ రాజు లు ముఖ్య అతిధులుగా కనిపించగా.. NTR30 హీరోయిన్ జాన్వీ కపూర్ చిలకపచ్చ పట్టు చీరలో అందంగా కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ఈ పూజలో భాగమయ్యాడు. ఇంకా నటుడు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నిర్మాత కళ్యాణ్ రామ్ లు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ స్టయిల్ గా క్యాప్ పెట్టుకుని స్పెషల్ గా కనిపించారు. ఆయన రాగానే రాజమౌళి తో పాటుగా అందరిని పలకరిస్తూ పూజా కార్యక్రమాలు జరిగే స్టేజ్ ఎక్కారు.
ఇంకా NTR30 ఓపెనింగ్ కి చాలామంది గెస్ట్ లు హాజరయ్యే అవకాశం ఉంది.. ఒక్కొక్కరిగా ఈ పూజా కార్యక్రమం జరిగే వేడుక దగ్గరకు చేరుకుంటుండగా.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఆ ఓపెనింగ్ లైవ్ కి అతుక్కుపోయారు.