సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లోని ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ దొంతనంలో ఇంట్లోని 60 లక్షలు విలువ చేసే వజ్రాల నగలు, బంగారం మాయమయ్యాయి. అయితే ఈ చోరీపై ఐశ్వర్య చెన్నై లోని తెన్నాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ లు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అది ఐశ్వర్య ఇంట్లో ఎప్పటినుండో పనిచేసే వాళ్ళే ఈ చోరీకి పాల్పడ్డట్టుగా పోలీస్ లు తేల్చి అందులో భాగంగా ఇద్దరు ఆడవాళ్ళని ఐశ్వర్య ఇంటి డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐశ్వర్య ఇంట్లో పని చేసే వాళ్ళు ఈ దొంగతనము చేసి ఆ నగలని అమ్మేసి డబ్బు రూపేణా వారు చెన్నై లోని ఓ ఇల్లు, ఇంకా కొన్ని వస్తువులు కొనుగోలు చేసినట్లుగా పోలీస్ లు ఆధారాలతో సహా నిర్ధారించారు. ఐశ్వర్య ఇంట్లో 18 ఏళ్లగా పని చేస్తున్న ఈశ్వరి అనే ఆవిడ మరో మహిళా, ఇంకా డ్రైవర్ వెంకటేష్ తో కలిసి మరో ముగ్గురు ఈ చోరీలో పాలు పంచుకున్నారని పోలీసులు తేల్చారు.
అయితే ఐశ్వర్య పోలీస్ కంప్లైంట్ లోనే తన ఇంటి పని వాళ్లపై అనుమానం ఉంది అని, ఈశ్వరి, డ్రైవర్ వెంకటేష్ తరుచూ తన అపార్ట్మెంట్ కి వెళుతూ ఉండేవారు. వారికి నా లాకర్ కీ అవి ఎక్కడ ఉన్నాయో తెలుసు అని అనుమానం పోలీస్ ల దగ్గర వ్యక్తం చెయ్యగా.. పోలీసులకి ఈ కేసు ఛేదించడం తేలికైనట్లుగా తెలుస్తుంది. ఇంకా వీరు గత కొన్నాళ్లుగా ఐశ్వర్య ఇంట్లోని వస్తువులు ఎవరికీ తెలియకుండానే దొంగిలిస్తున్నారని పోలీస్ విచారణలో తెలిసింది. అయితే ఐశ్వర్య ఇంట్లో దాదాపుగా 100 కాసుల బంగారం, నాలుగు కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాలు, కొన్ని పత్రాలు ఈ చోరీలో అపహరణకు గురైనట్లుగా పోలీస్ లు తెలిపారు.