Advertisement
Google Ads BL

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య


నందమూరి నటసింహ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో క్రేజీ మూవీగా మొదలైన NBK108 షూటింగ్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. తారకరత్న కారణంగా కొద్దిగా వాయిదా పడిన NBK108 షూటింగ్ మళ్ళీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలయ్యింది. బాలకృష్ణ కి జోడిగా గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ రీసెంట్ గానే NBK108 సెట్స్ లోకి జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో బాలయ్య నడి వయస్కుడిగా కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టకముందే రివీల్ చేసాడు.

Advertisement
CJ Advs

డిసెంబర్ లో  మొదలైన NBK108  రెగ్యులర్ షూట్.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అయితే ఈరోజు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా NBK108  టైటిల్ కానీ.. ఫస్ట్ లుక్ రాబోతున్నట్లుగా నందమూరి ఫాన్స్ ఎదురు చూసినట్లుగానే.. ఈ ఉగాదికి NBK108 నుండి బాలకృష్ణ ఫస్ట్ లుక్ వదిలారు. ఈమధ్యన లుక్స్ వైజ్ గా అందరిని ఇంప్రెస్స్ చేస్తున్న బాలకృష్ణ NBK108 లో ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీతో ఫాన్స్ ఉన్నారు. అందరి అంచనాలకి మించి అనిల్ రావిపూడి బాలయ్య ని రెండు వేరియేషన్స్ ఉన్న లుక్స్ తో ఫాన్స్ కి పూనకాలు తెప్పించాడు. ఈ చిత్రంలో బాలయ్య సింగిల్ గానే కనిపిస్తారు. కానీ మూడు రకాల వేరియేషన్స్ ఒకే పాత్రలో చూపించబోతున్నారు. అందులో ఇప్పుడు రెండు లుక్స్ ని అనిల్ ఉగాది స్పెషల్ గా రివీల్ చేసారు.

సాంప్రదాయ దుస్తులు ధరించి బాలకృష్ణ మొదటి పోస్టర్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు, ఆయన మెడ మరియు చేతిపై పవిత్రమైన దారాలను ధరించారు. బాలకృష్ణ చేతిపై టాటూ ఇంక్ ఉంది. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్‌లలో కనిపిస్తున్నారు. మరో పోస్టర్ లో గడ్డం మరియు హ్యాండిల్‌బార్ మీసాలతో కొత్త అవతార్‌లో బాలయ్య దుమ్మురేపారు. ఆయన వెనుక ఉదయించే సూర్యుడిని మనం చూడవచ్చు. ఈ లుక్ లో బాలయ్య చాలా తక్కువ వయసున్న వాడిలా కనిపించారు. NBK108 రెండు పోస్టర్లు మాస్ మరియు ఆర్షణీయంగా ఉన్నాయి

NBK108 first look revealed :

NBK108 Ugadi special look revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs