Advertisement
Google Ads BL

నాలా ఎవరూ తప్పు చెయ్యొద్దు: పాయల్


ఆరెక్స్ 100 చిత్రంతో బోల్డ్ కేరెక్టర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజపుట్ కి ఆ సినిమా హిట్ ఏ మాత్రం హెల్ప్ చేయలేకపోయింది. ఆ తర్వాత కూడా ఆమెకి ఆరెక్స్ 100 లాంటి పాత్రలే తగిలాయి. అవి కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో అవకాశం ఇచ్చినా ఆమె యూస్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ నే నమ్ముకుంది. అజయ్ భూపతి తాజా చిత్రం మంగళవారంలో పాయల్ నటిస్తుంది.

Advertisement
CJ Advs

అయితే పాయల్ రాజపుట్ హెల్త్ విషయంలో తానొక తప్పు చేశాను, అలాంటి తప్పు మరెవరూ చెయ్యొద్దు అంటూ చెబుతుంది. తనకి అనారోగ్య సమస్య ఎదురైంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటూ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. తాను ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వలనే తనకి ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది.. నాలా ఎవరూ తప్పు చెయ్యొద్దు, నీళ్లు ఎక్కువ తాగండి, ప్రస్తుతం నాకు ట్రీట్మెంట్ ముగిసింది.

యాంటిబయోటిక్స్ లాస్ట్ డోస్ తీసుకుంటున్నాను, మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యేందుకు సిద్దమవుతున్నాను, అడ్డంకులు వస్తాయి.. కానీ వాటిని అధిగమించాలి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా షూటింగ్స్ ఆపలేదు, సెలైన్ బాటిల్ తో సెట్స్ కి వెళుతున్నా, నాకు అజయ్ తో చేస్తున్న మంగళవారం సినిమా ఎంతో ఇంపార్టెంట్ అంటూ పాయల్ తన అనారోగ్యం విషయాలని సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. 

Payal Rajput Says She Had Kidney Infection:

Payal Rajput says about her Health Problems in social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs