Advertisement
Google Ads BL

అందుకే ఆస్కార్ కి వెళ్ళలేదు: RRR దానయ్య


ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య ఆస్కార్ వేడుకలకి దూరంగా అమెరికా వెళ్లకుండా ఉండడానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన రోజున ఆనందపడిన ఆయన నేను కాల్ చేస్తే రాజమౌళి ఎత్తలేదు అంటూ అనుమానం వచ్చేలా మాట్లాడం.. ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే ఆస్కార్ కి 80కోట్లు ఖర్చు పెట్టడం ఇష్టం లేకనే దానయ్య అమెరికా వెళ్ళలేదు, రాజమౌళి కూడా దానయ్యని పట్టించుకోలేదంటూ కొంతమంది రాజమౌళిని కూడా విమర్శించారు.

Advertisement
CJ Advs

తాజాగా దానయ్య ఆస్కార్ వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత ఎవరు అంటే దానయ్య పేరే చెబుతారు కదా. నాకు అది చాలు. నాటు నాటు పాటకి ఆస్కార్ రావడం ఎంతో గర్వంగా ఉంది. ఆస్కార్ అవార్డులకు రాజమౌళి నన్ను దూరం పెట్టారు అనేది పూర్తిగా అవాస్తవం. రాజమౌళి అలాంటి వారు కాదు.. ఆయన తన నిర్మాతలకి చాలా గౌరవం ఇస్తారు. అలా తన నిర్మాతలని పక్కనబెట్టే వ్యక్తిత్వం ఆయనిది కాదు. ఆయన చాలా మంచివాడు. నాకు ఇష్టం లేకే నేను ఆస్కార్ కి వెళ్ళలేదు.

నేను చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాను, ఆర్భాటాలు నాకు నచ్చవు. ఈ సినిమాతో నాకు పేరు రావాలి అనుకున్నాను. అది వచ్చేసింది. నాకు అది చాలు. ఇక హడావిడి ఇష్టం లేకనే నేను ఆస్కార్ వేడుకలకి వెళ్ళలేదు.. అంటూ ఆస్కార్ వేడుకలకు వెళ్లలేకపోవడంపై తనపై వచ్చిన రూమర్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు దానయ్య. 

ఇక ఆస్కార్ కి అవార్డు కోసం రాజమౌళి 80 కోట్లు ఖర్చు పెట్టారట నిజమేనా అని అడిగితే.. నేను అయితే డబ్బేమీ పెట్టలేదు. అలాగే రాజమౌళి ఏమైనా ఖర్చు పెట్టరేమో నాకు తెలియదు. అయినా సినిమాకే అంత లాభం ఉండదు. కానీ అవార్డులకు అంత ఖర్చు పెట్టడం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటూ దానయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

That's why he didn't go to the Oscars: Danayya:

RRR Movie Producer D. V. V. Danayya Reaction On Naatu Naatu Song Wins Oscar 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs