Advertisement
Google Ads BL

శ్రీలీల-మాళవిక మోహనన్ మధ్యలో పవన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా సాయి తేజ్ తో కలిసి సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న PKSDT రీమేక్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి 22 రోజుల డేట్స్ కి గాను.. తాను రోజుకి 2 కోట్ల పారితోషకం అందుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. అందుకే ఈచిత్రంపైన విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావోస్తుండడంతో పవన్ కళ్యాణ్ ఈ నెల చివరి వారం నుండి హారిష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.

Advertisement
CJ Advs

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటించబోతుంది అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కి చోటు ఉండబోతుందట. అందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా.. ఇప్పుడు ఈ చిత్రంలోకి మాళవిక మోహనన్ ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్-మారుతీ చిత్రంతో తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్న మాళవిక మోహనన్ కి పవన్-హరీష్ చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.

ఆ వార్త చూసి అటు శ్రీలీల-ఇటు మాళవిక మోహన మధ్యలో పవన్ కళ్యాణ్ అంటూ అప్పుడే పవన్ ఫాన్స్ వీరి ఫొటోస్ ని డిజైన్ చేసి ట్రెండ్ చెయ్యడమే కాదు.. #UstaadBhagatSingh హాష్ టాగ్ తో రచ్చ మొదలు పెట్టారు.

Pawan between Sreeleela-Malavika Mohanan:

Malavika Mohanan hot romance Pawan Kalyan in Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs