Advertisement
Google Ads BL

విజయ్ అంటే లవ్ అంటున్న రష్మిక


విజయ్ దేవరకొండ-రష్మిక వీరిద్దరూ మీడియాలో ఎప్పుడూ హైలెట్ అయ్యే పేర్లు. ఎందుకంటే వీరి మధ్యన స్నేహానికన్నా మించి ఏదో ఉంది అనే రూమర్ బాగా పాపులర్ అయ్యింది. రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన వీరి మధ్యన ఏదో ఉంది అనుకునేంతగా అభిమానులైతే లేరు. కానీ వీరిద్దరూ వెకేషన్స్ అంటూ చట్టాపట్టాలేసుకుని తిరగడం, లేట్ నైట్ డిన్నర్స కి వెళ్లడంతో వీరి మధ్యన లవ్ అనే న్యూస్ పుట్టింది. కానీ వారు మా మధ్యన స్నేహం తప్ప మరేమి లేదు అంటారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా రష్మిక కాస్త ఖాళీ సమయం దొరకడంతో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో కొంతమంది అభిమానులు రశ్మికతో కలిసి సామి.. సామి.. సాంగ్ కి నీతో స్టెప్ వెయ్యాలని ఉంది అని అడగగా.. దానికి రష్మిక సరదాగా సామి స్టెప్‌ను ఇప్పటికే చాలాసార్లు చేశాను, ఇలాగే చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ సమస్యలొస్తాయని, నడుము పడిపోతుంది అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ప్రతిసారి నన్ను ఇదే ఎందుకు అడుగుతున్నారు. కలిసినపుడు ఏదైనా కొత్తగా చేద్దాం అంటూ రిప్లై ఇచ్చింది.

విజయ్ తో నటించితిన్ వారిసు సెట్స్ లో దర్శకుడు వంశి.. నేను సోఫాలో పడుకుని నిద్రపోతున్నప్పుడు ఫొటోస్ తీసి విజయ్ కి చూపించి ఏడిపిస్తూ ఉండేవారు అని చెప్పిన రశ్మికకి.. మీకు ఏ సౌత్ ఫుడ్ అంటే ఇష్టమని అడిగితే.. రైస్‌తో పాటు సాంబార్, రసం, పప్పు, పెరుగు ఇష్టమని చెప్పింది. ఇంకా ఆమెని విజయ్ అంటే ఒక్క వర్డ్ లో ఆన్సర్ ఇవ్వమనగానే లవ్ అంటూ చెప్పింది. అయితే తనకి విజయ్ తో వర్క్ చెయ్యడం చాలా ఇష్టమని, చాలా ఎగ్జైట్ అవుతున్నట్లుగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే అభిమానులెవరూ రశ్మికని విజయ్ దేవరకొండ గురించి మాత్రం అడగలేదు.

Rashmika chit chat with her fans:

Rashmika Mandanna Live Chit Chat With Her Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs