Advertisement
Google Ads BL

NBK108 సెట్స్ లోకి కాజల్ ఎంట్రీ


నందమూరి నటసింహం బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో డిసెంబర్ లో మొదలైన #NBK108 చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ మిడిల్ ఏజ్ ఉన్నకేరెక్టర్ లో మూడు వేరియేషన్స్ చూపించబోతున్నారు.. అంటూ అనిల్ రావిపూడి నందమూరి అభిమానుల్లో అంచనాలు పెంచేసాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా త్రిషని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. బాలయ్యకి జోడిగా కాజల్ నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తూ #NBK108 సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ కి వెల్ కమ్ చెబుతూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రంలో నటించడానికి కాజల్ భారీగా డిమాండ్ చేసింది అంటూ ప్రచారం జరిగింది. ఇక కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఉగాది రోజున కాజల్ తమిళంలో నటించిన ఘోస్ట్ చిత్రాన్ని తెలుగులో కోష్ఠి గా విడుదల చెయ్యబోతున్నారు. అలాగే కమల్ హాసన్ తో కాజల్ ఇండియన్ 2 లో నటిస్తుంది.

ఇప్పుడు బాలయ్య బాబు పక్కన నటించడానికి రెడీ అయ్యింది. ఇక NBK108 సెట్స్ లోకి ఈమధ్యనే మరో హీరోయిన్ శ్రీలీల ఎంటర్ అయిన విషయాన్ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కాజల్-శ్రీలీల లు బాలయ్య పక్కన ఎలా కనిపిస్తారో అనే క్యూరియాసిటీని అనిల్ పెంచేసాడు.

Kajal Aggarwal Joins The Shoot Of NBK108:

Kajal Aggarwal Joins The Shoot Of Balakrishna, Anil Ravipudi NBK108
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs