బిగ్ బాస్ లో టైటిల్ కోసం అభిజిత్ తో హోరా హోరీగా గొడవపడి చివరికి రన్నర్ అప్ గా మిగిలి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిన అఖిల్ సార్థక్.. తర్వాత ఈటివి ఢీ డాన్స్ షో లో మెంటర్ గా వ్యవహరించడమే కాదు.. కొన్ని ఛానల్స్ లో యాంకర్ అవతారమెత్తాడు. బిగ్ బాస్ నుండి బయటికి రాగానే మోనాల్ గజ్జర్ తో అఖిల్ సినిమా మొదలు పెట్టాడు. అదసలు ఏమైందో కూడా తెలియదు. ఆ తర్వాత అఖిల్ మళ్ళీ గత ఏడాది బిగ్ బాస్ ఓటిటిలోకి ఎంటర్ అయ్యాడు. టైటిల్ ఫెవరెట్ గా హౌస్ లోకి దిగిన అఖిల్ కి చివరిలో బిందు మాధవి షాకిచ్చింది. మళ్ళీ రన్నర్ గా మిగిలిపోయాడు.
బిందు మాధవి విన్నర్ అయ్యి ఓటిటి టైటిల్ పట్టుకుపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 ముగిసాక స్టార్ మా వారు BB జోడి అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని జోడీలుగా కలిపి డాన్స్ షో నిర్వహిస్తున్నారు. అందులో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి మడివాడ తో కలిసి డాన్స్ చేస్తున్నాడు అఖిల్. వీరిద్దరూ రొమాంటిక్ సాంగ్స్ తో జెడ్జ్ ల నుండి ప్రశంశలు పొందుతున్నారు. BB జోడి టైటిల్ ఫెవరెట్స్ లో ఈ జోడి కూడా ఒకటి. అలాంటి అఖిల్ BB జోడి నుండి సడన్ గా బయటికి రావడమే ఎవరికీ అర్ధం కాలేదు. కానీ అఖిల్ సార్థక్ సోషల్ మీడియా ద్వారా తానెందుకు BB జోడి నుండి బయటికి వచ్చాడో, తనకేమైందో చెప్పాడు. తనకి ఎప్పటినుండో పొట్ట కింద భాగంలో బాగా పెయిన్ వచ్చేదని, కానీ అదేమీ పట్టించుకోకుండా డాన్స్ చేశాను.
సాంగ్ పెరఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నొప్పిని భరిస్తూనే చేశాను. నా గాయం ఎవరికీ కనిపించదు, బయటికి తెలీని నొప్పిని భరిస్తున్నాను, అది తెలియనివారు రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ నా కడుపు కింది భాగంలో పెయిన్ ఎక్కువవడంతోనే నేను BB జోడి నుండి బయటికి వచ్చేసాను. నేను తేజు చాలా కష్టపడ్డాము, కానీ ఏమి చెయ్యలేని పరిస్థితిలో నేను షో వదిలేసాను, షాకింగ్ ఏమిటంటే నేను తేజు.. బాటమ్ 2 లో ఉన్నాము. అయినా పర్లేదు. మరో షో ద్వారా మిమ్మల్ని కలుస్తాను అంటూ అఖిల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.