నందమూరి బాలకృష్ణ అంటే గతంలో ఉన్న అభిమానం కన్నా నందమూరి ఫాన్స్ కి ఈమధ్యన అది మరింత ఎక్కువైంది. తారకరత్న కోసం అహర్నిశలు బాలయ్య పడిన కష్టం, ఆయన ఆసుపత్రిలో ఉండగా.. చూపించిన ప్రేమ, తారకరత్నచనిపోయిన తర్వాత తీసుకున్న శ్రద్ద, తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉన్న బాలయ్య ని చూసిన అభిమానులు ఆయనని మరింతగా పొగుడుతూ మరింత అభిమానం చూపిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన ఓ మంచి పనికి అది కూడా తారకరత్న కోసం చేసిన పనికి బాలయ్య అభిమానులకి నోటా మాటరావడం లేదు..
బాలయ్య అభిమానుల్లో ఒకరు.. సోషల్ మీడియాలో ఆయన చేసిన పనిని వివరిస్తూ ఇలా ట్వీట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ.. తన బిడ్డ తారకరత్న పేరిట cardiac, thoracic surgery పేదలకి ఉచితంగా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు..
తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అని హిందూపురంలో తను నిర్మించిన హాస్పటల్ లో H-Block కి తారకరత్న గారి పేరు పెట్టారు..1 కోటి 30 లక్షల విలువ చేసే Surgical instruments తెప్పిస్తున్నారు..
చిన్నపిల్లలకి ఉచిత భోజనంతోపాటు కావాల్సిన మందులు కూడా 3 నెలల పాటు ఫ్రీగా ఇవ్వనున్నారు.
బంగారు బాలయ్య 🙏😍 అంటూ ఆయన చేసిన మంచి, గొప్ప పనిని కీర్తిస్తూ ట్వీట్ చేసారు.