Advertisement
Google Ads BL

నిహారిక-చైతన్య.. ఏదో తేడాగా ఉందే?


ఈ మధ్య సినీ ప్రముఖుల పెళ్లిళ్లు సిల్లీ రిజన్స్‌తో విడాకులకు దారితీస్తున్న విషయం తెలిసిందే. అందులో నాగచైతన్య, సమంతల మ్యాటర్ మొన్నటి వరకు హైలెట్ అవుతూనే ఉంది. ఇప్పటికీ వారి పేర్లు ఈ విడాకుల విషయంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక జంట విషయంలో ఏదో తేడాగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లే సోషల్ మీడియాలో వారిద్దరి బిహేవియర్ ఉంది. వాస్తవానికి ఇది వారి పర్సనల్ విషయం అయినప్పటికీ.. నిహారిక సెలబ్రిటీ కావడంతో, ఒక్కసారిగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి శ్రీజ, కళ్యాణ్‌దేవ్‌ల విషయంపై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. మీడియా పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు కానీ.. లేదంటే మెగా ఫ్యామిలీ మరోసారి సోషల్ బజారులో పడేది. అయితేనేం.. ఇప్పుడు నిహారిక రూపంలో మీడియాకి మరింత మేత దొరికేసింది. తాజాగా నిహారిక, చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఒకరి నొకరు ఆన్ ఫాలో చేసుకోవడంతో పాటు.. ఇద్దరూ వారి పెళ్లి ఫొటోలను తొలగించారు. వాస్తవానికి కొద్ది రోజులుగా నిహారిక, చైతన్య జంట మధ్య సఖ్యత లేదంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, బలమైన ఎవిడెన్స్ లేకపోవడంతో మీడియా సరిగా ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు నిహారిక, చైతన్య సోషల్ మీడియాలో చేసిన పనికి.. నిజంగానే వారిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందనేలా వార్తలు మొదలయ్యాయి.

మరి ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ లేదంటే చైతన్య ఫ్యామిలీ వివరణ ఇస్తేనే గానీ.. లేదంటే మెగా ఫ్యామిలీ పరువును మీడియా.. సోషల్ బజారులో పెట్టేయడం ఖాయం. ఇలాంటి విషయాలలో, అందునా మెగా ఫ్యామిలీ అంటే.. కొన్ని మీడియా సంస్థలు కాచుకుని కూర్చుంటాయి. వారింట్లో ఏం జరుగుతుందా? ఎలా బ్లేమ్ చేయాలా? అని ఎదురు చూస్తుంటాయి. ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు.. పెళ్లి అనంతరం సఖ్యత కుదరకపోతే చట్టపరంగా విడాకులు తీసుకోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీ అనగానే ఇదేదో పెద్ద తప్పుగా ప్రొజక్ట్ చేయడానికి కొన్ని మీడియా సంస్థల్లో ఆల్రెడీ కథనాలు రెడీ అయిపోయే ఉంటాయి. ఇంకొన్ని గంటల్లో క్లాప్ కొట్టి.. యాక్షన్ మొదలెడతారు.

All Is Not Well Between Niharika And Chaitanya?:

Rumors on Mega Daughter Niharika Married Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs