‘ఎన్ని జన్మలు ఎత్తినా.. నీతో ఉండాలనే కోరిక.. ఉంటాననే ఆశ. మీరు నా ప్రాణం’.. ఇటువంటి మాటలు చెప్పడంలో నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ని మించిన వారు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. అదీ కూడా ఒక్క పవన్ కల్యాణ్ విషయంలోనే ఆయన ఇలా చెబుతుంటారు. స్టేజ్‌పై ఉన్న బండ్ల గణేష్ చేతుల్లో మైకు.. స్టేజ్ ఎదురుగా సీట్లో పవర్ స్టార్ ఉంటే చాలు.. ప్రతి పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఇక కాలర్ ఎగరేసుకోవచ్చు. అలా ఉంటుంది బండ్ల స్పీచ్. ‘గబ్బర్‌సింగ్’ మూవీ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడిన స్పీచ్‌ని.. తాజాగా ఓ నెటిజన్ షేర్ చేసి.. అతనికో రిక్వెస్ట్ పెట్టాడు.
‘‘బండ్ల గణేష్ అన్నా.. పవన్ అన్నకి నీ అపార్థాలతో దూరంగా ఉండకు.. ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్లు. సమయం దొరికినప్పుడు కలువు. ఆయనని అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు. మీరు అలా కావద్దు’’ అని కోరాడు. మెగాభిమాని అడిగిన ఈ కోరికకు బండ్ల గణేష్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక చర్చలకు తావిస్తోంది. అయితే మొదటి నుంచి బండ్ల గణేష్ ఓ దర్శకుడిపై ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు పేలుస్తున్నారు. ఆ మధ్య ఆయన మాట్లాడిన ఓ ఆడియో అయితే ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే ఇండస్ట్రీలో కల్పిస్తోంది. ఇంతకీ బండ్ల గణేష్ ఏమని చెప్పుకొచ్చాడంటే..
‘మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం. ఏం చేద్దాం బ్రదర్!’ అని బండ్ల గణేష్ రిప్లయ్ ఇచ్చాడు. ఈ రిప్లయ్‌లో డాలర్ శేషాద్రి ఎవరంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. ఇంకెవరు.. త్రివిక్రమ్ అంటూ మరికొందరు సమాధానమిస్తున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిలో అధికారిగా డాలర్ శేషాద్రి పని చేశారు. ఆ టైమ్‌లో దేవుడి పని ఏదైనా.. ఆయన దగ్గరుండి చూసుకునేవారు. ఆఖరికి గుడిని శుభ్రం చేయడానికి చీపురు కూడా పట్టేవారు. అలాంటి శేషాద్రితో త్రివిక్రమ్‌ని బండ్ల పోల్చాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల చేసిన ఈ ట్వీట్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………! https://t.co/QwK0vGQlcZ
— BANDLA GANESH. (@ganeshbandla) March 18, 2023