Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హీరోయిన్‌పై లైంగిక దాడి!


పాయల్ ఘోష్ గుర్తుందా..! తాజాగా ఆమె సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘ఊసరవెల్లి’ చిత్రంలో నటించిన పాయల్ ఘోష్.. టాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలలో మంచి పాత్రలను చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఆమె షేర్ చేసుకుంది. టాలీవుడ్‌‌పై, టాలీవుడ్ దర్శకులపై ఆమె ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Advertisement
CJ Advs

‘‘నేను సౌత్‌లో నేషనల్ అవార్డ్ సాధించిన ఇద్దరు దర్శకులతోనూ, ఇంకా ఇతర స్టార్ డైరెక్టర్స్‌ రూపొందించిన చిత్రాలలో నటించాను. వాళ్లెవరూ, ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్ విషయానికి వస్తే.. నేను అతనితో వర్క్ చేయకుండానే అనురాగ్ కశ్యప్ నాపై లైంగికంగా దాడి చేశారు. మేము కలిసిన మూడో మీటింగ్‌లోనే నాకీ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు చెప్పండి.. నేను సౌత్ సినీ పరిశ్రమ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోకూడదో..’’ అంటూ పాయల్ తన ట్వీట్‌లో పేర్కొంది.

మరో ట్వీట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేను సౌత్‌లో సూపర్ స్టార్ అయిన తారక్‌తో కూడా నటించాను. కానీ ఎప్పుడూ అతను నా పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. తారక్ చాలా గొప్ప మనిషి. నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందుకే చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చింది. పాయల్ చేసిన ఈ ట్వీట్స్‌పై ప్రస్తుతం భారీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. కాగా, ఇటీవల పాయల్ పోస్ట్ చేసిన ఆత్మహత్య లెటర్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.  

Young Tiger NTR Movie Heroine Payal Ghosh Tweets Goes Viral:

Payal Ghosh Sensational Comments on Bollywood 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs