ప్రపంచ పటంలో తెలుగువాడిని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన పాట ‘నాటు నాటు’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాట ఆస్కార్ అవార్డును కొల్లగొట్టి.. తెలుగోడి సత్తా చాటింది. తెలుగోడు మాత్రమే కాదు.. భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఇప్పుడీ పాటకు దక్కిన గౌరవంతో.. ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆర్ఆర్ఆర్ టీమ్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారంతా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక తెలుగువారి ఆనందానికి అయితే అవధులే లేవు. ఈ విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు టాలీవుడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘ఆస్కార్’ అవార్డుతో పాటు గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్‌కు.. ప్రస్తుతం ఆయన చేస్తున్న RC15 టీమ్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది.
ఆ వెల్‌కమ్ చూస్తే అంతా షాక్ అవుతారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. దాదాపు 400 ప్రొఫెషనల్ డ్యాన్సర్స్‌తో ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తూ.. రామ్ చరణ్‌కు స్వాగతం పలికారు. నాటు నాటు పాటకు ప్రభుదేవాతో పాటు 400 మంది కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందరూ ప్రభుదేవా టీమ్ ఇరగదీసిండ్రు.. చరణ్‌కు ఘన స్వాగతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ పాటలో ప్రభుదేవా అండ్ టీమ్ నాటు నాటు స్టెప్స్‌తో ఇరగదీశారు.
ఇక వీడియోకి రామ్ చరణ్ కూడా రిప్లయ్ ఇచ్చారు. ఈ స్వాగతానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్‌కి థ్యాంక్యూ. RC15 సెట్స్‌లోకి ఇలా అడుగుపెడుతున్నందుకు గొప్పగా ఫీలవుతున్నానని ట్వీట్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోని చరణ్ సతీమణి ఉపాసన రీ ట్వీట్ చేస్తూ.. RC15 సెట్స్‌లోకి రామ్ చరణ్ అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందో చూశారా? ప్రభుదేవా సార్‌తో పాటు 400 మంది టాలెంటెడ్ డ్యాన్సర్స్ అద్భుతంగా స్వాగతం పలికారు అంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది.
Here’s what happened when @AlwaysRamCharan entered the sets of #RC15
— Upasana Konidela (@upasanakonidela) March 19, 2023
Warmest welcome from @PDdancing Prabhu Deva ji & 400 super talented dancers. 🙏🤗❤️🥹#backtowork 👌 pic.twitter.com/aTj3LhxFth