సొట్ట బుగ్గల చిన్నది హన్సిక.. హీరోయిన్ గా తెలుగు తమిళ సినిమాలు చేస్తుంది. కెరీర్ లో ముందుకు సాగుతూనే గత ఏడాది ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకుని ఏడడుగులు నడిచింది. తన ఫ్రెండ్ మాజీ భర్త సోహైల్ కూతురియాని ప్రేమ వివాహం చేసుకుంది. డిసెంబర్ 4 న రాజస్థాన్ జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ని హన్సిక వివాహం చేసుకుంది. అయితే హన్సిక తన పెళ్లి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి అమ్మేసింది.
హన్సిక మెహిందీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్.. ఇలా ప్రతి వేడుకని డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చెయ్యడానికి భారీ ధర చెల్లించి పెళ్లి హక్కులు కొనేశారు. అయితే హన్సిక-సోహైల్ వివాహ వేడుకతో పాటుగా.. హన్సిక ఫ్యామిలీ మెంబెర్స్, సైహైల్ ఫ్యామిలీ మెంబెర్స్ పై కొన్ని ప్రత్యేకమైన వీడియోస్ ని షూట్ చేసారు. అందులో ఇరు ఫ్యామిలీ మెంబెర్స్ అనేక విషయాలను పంచుకున్నారు. లవ్ షాదీ డ్రామా పేరుతొ ప్రసారం కానున్న ఈ పెళ్లి వేడుకలో హన్సిక తో పాటుగా ఆమె తల్లి కూడా గతంలో తాము ఎదుర్కున్న సమస్యలు, వాటి పరిష్కారాలను చెప్పారు.
అందులో భాగంగా హన్సిక తల్లి చెప్పిన కొన్ని విషయాలు హైలెట్ గా హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే.. హన్సికని పెళ్లి చేసుకోబోయే వరుడు సోహైల్ అనుకున్న సమయానికి పెళ్లి వేడుక దగ్గరికి చేరుకోలేకపోయారట. దానితో కాస్త టెన్షన్ అయిన హన్సిక తల్లి మోనా.. సోహైల్ తల్లికి ఫోన్ చేసి.. అసలస్యమైతే.. నిమిషానికి ఐదు లక్షలు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పినట్లుగా ఆమె ఆ ఎపిసోడ్ లో చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. కొంతమంది హన్సిక తల్లి నిమిషానికి ఐదు కోట్ల డిమాండ్ విని షాకైపోతున్నారు. ఆమె సరదాగానే చెప్పినా ఇప్పుడా విషయం వైరల్ అయ్యింది.