Advertisement
Google Ads BL

జీ సినీ అవార్డ్స్ స్టేజ్ పై ఇరగ్గొట్టేసిన రష్మిక


రష్మిక మందన్న పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ తో బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ పట్టెయ్యడమే కాదు.. బాలీవుడ్ భామలకు గట్టి పోటీ ఇస్తూ జిమ్ లు, గ్లామర్ షో అంటూ రచ్చ చేస్తుంది. బాలీవుడ్ లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా రష్మిక గ్లామర్ డాల్ లా మారిపోతుంది.. ఆమె వేసే డ్రెస్సులతో ఒక్కోసారి ట్రోల్ అవుతుంది కూడా. తనకి మ్యాచ్ కానీ పర్ఫెక్షన్ లేని డ్రెస్సులతో అందాలు ఆరబోసే ప్రాసెస్ లో నెటిజెన్స్ కి దొరికిపోతుంది. అయినప్పటికీ.. రష్మిక ఆ విషయంలో అస్సలు తగదు.

Advertisement
CJ Advs

ఇక పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి నటించడమే కాదు, పాన్ ఇండియా స్టయిల్లో సినిమాని ప్రమోట్ చేసి సామీ.. రారా సామీ.. అంటూ స్టేజ్ లపై అదరగొట్టేసే డాన్స్ పెరఫార్మెన్సెస్ తో ఆకట్టుకున్న రష్మిక తాజాగా #ZCA2023 (జీ సినీ అవార్డ్స్) అవార్డుల వేడుకలో రెడ్ డ్రెస్ తో స్టేజ్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. ఈ అవార్డుల వేడుకకి అదిరిపోయేలా రెడీ అయ్యి వచ్చిన రష్మిక స్టేజ్ పై పుష్ప లోని సాంగ్ కి డాన్సర్స్ తో కలిసి డాన్స్ స్టెప్స్ తో ఇరగ్గొట్టేసింది. తాజాగా తన ఫొటోస్ ని, ఆ సాంగ్ క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానితో రష్మిక ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఆ రెడ్ మోడ్రెన్ డ్రెస్ లో రష్మిక గ్లామర్, ఆమె అందాలు అద్భుతంగా ఎక్స్పోజ్ అయ్యాయి. తాను స్కూల్ తర్వాత ఫస్ట్ స్టేజ్ పెరఫార్మెన్స్ అంటూ Grown up performing on stage for school cultural events and am still living that life.. love it! Love the feel of performing on stage.. the lil girl in me is the happiest….❤️❤️ Watch me perform tonight on zee! 🥰 #ZCA2023 #FirstOnTv #MarutiSuzukiArenaZCA అంటూ ఆ పిక్స్ ని షేర్ చేసింది.  

Rashmika rocks stage of ZCA 2023:

Rashmika Mandanna rocks stage of Zee Cine Awards 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs