మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 కోసం జిమ్ లో బాగా వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB28 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ఈ రోజు సీనియర్ నటుడు జయరామ్ జాయిన్ అయ్యారు. త్రివిక్రమ్ గత బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంఠపురములో అల్లు అర్జున్ కి ఫాదర్ కేరెక్టర్ చేసిన జయరామ్ ఇప్పుడు మహేష్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
జయరామ్ తో మహేష్-త్రివిక్రమ్ ఉన్న పిక్స్ బయటకి వచ్చాయి. మహేష్ అయితే స్టైలిష్ గానే కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తుండగా.. సీనియర్ నటులు జగపతి బాబు న్యూ మేకోవర్ తో SSMB28 లో స్పెషల్ గా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ త్వరత్వరగా కంప్లీట్ చేసేసి.. ఆగష్టు 11న విడుదల చెయ్యాలని త్రివిక్రమ్ చూస్తున్నారు.
అయితే ఈ ఉగాదికి SSMB28 ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా వదిలే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ SSMB28 కి పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.