Advertisement
Google Ads BL

ఈ రేంజ్ స్వాగతం ఊహించలేదేమో..


ఎక్కడా ఆర్.ఆర్.ఆర్ చూసినా నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచిన విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటికి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి వారం అవుతుంది. ఇంకా ఇంకా ఈ హడావిడి ముగియలేదు. అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తూ ఆ హంగామాని ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు.. ఆర్ ఆర్ ఆర్ టీమ్ సభ్యులు. ఎన్టీఆర్ నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టగానే ఆయన అభిమానుల నుండి ఎన్టీఆర్ కి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన భార్య ప్రణతి స్వయంగా ఎన్టీఆర్ ని రిసీవ్ చేసుకుంది. ఇక రాజమౌళి అండ్ ఫ్యామిలీ కూడా అంతే హంగామాతో నిన్న శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టారు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ నిన్న ఉదయం ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ మీడియా, అభిమానుల మధ్యన రామ్ చరణ్ సందడి చేసాడు. సాయంత్రానికి హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలవడం, ఇండియా టుడే కాన్‌క్లేవ్ సదస్సులో పాల్గోవడం అన్ని బాగా హైలెట్ అయ్యాయి. తండ్రి చిరుతో కలిసి ఢిల్లీలో సందడి చేసిన రామ్ చరణ్ గత రాత్రి స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ కి రాకుండా.. నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేట ఎయిర్ పోర్ట్ లో భార్య ఉపాసనతో సహా అడుగుపెట్టాడు. 

ఎయిర్ పోర్ట్ లోనే రామ్ చరణ్ కి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. తర్వాత రామ్ చరణ్ కారు వెనుకగా మెగా ఫాన్స్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జై రామ్ చరణ్ నినాదాలతో హంగామా సృష్టించారు. రామ్ చరణ్ పై ఆయన కారుపై పూలు చల్లుతూ మెగా ఫాన్స్ చేసిన రచ్చని రామ్ చరణ్ కూడా ఊహించి ఉండడేమో అనేంతగా ఉందా హంగామా. చరణ్ ఎయిర్పోర్ట్ లో చేసిన సందడి, ఆయన అభిమానుల స్వాగతం వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Can't imagine the welcome of this range..:

Ram Charan gets a grand welcome in Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs