Advertisement
Google Ads BL

‘రానా, వెంకీ’లపై రాములమ్మ ఫైర్


దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై.. మంచి స్పందనతో పాటు అంతే స్థాయిలో వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇందులో వాడిన భాష చాలా మందికి అభ్యంతరకరంగా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఇమేజ్‌తో అందరి అభిమానాన్ని చాటుకున్న విక్టరీ వెంకటేష్‌పై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంచి ఇమేజ్‌ని నాశనం చేసుకోవడానికే ఆయన ఈ వెబ్ సిరీస్ చేశాడా? అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.., చాలా కాలం తర్వాత సరికొత్త వెంకటేష్‌ని చూస్తారంటూ మరికొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే ఇందులో ఉన్న బూతు డైలాగ్స్, శృంగార కంటెంట్‌పై మాత్రం భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి.. ఇన్ డైరెక్ట్‌గా ఈ వెబ్ సిరీస్‌పై పంచ్‌లు పేల్చింది. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా ఇటువంటి ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందు ముందు ప్రజా, మహిళా వ్యతిరేకత రాకముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విడుదల చేసే కంటెంట్‌కు సెన్సార్ తప్పనిసరి చేయాలని ఆమె సలహా ఇచ్చింది. అంతేకాకుండా.. తన సహనటులకు, నిర్మాతలకు కూడా ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది. ఇంతకీ రాములమ్మ ఏమని పోస్ట్ చేసిందంటే..

ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై......

‘It needs Censor for ott platform’...

అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.

ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను.

-విజయశాంతి

Vijayashanthi Comments on Rana Naidu Web Series:

It needs Censor for ott platform Says Lady Super Star Vijayashanthi 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs