Advertisement
Google Ads BL

చరణ్ వెనుక తండ్రి చిరు


అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆ క్రేజ్ ని ఎవరు ఎలా వాడుకుంటారో కానీ.. ఆర్.ఆర్.ఆర్ కి మూడు పిల్లర్స్ అయినా రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ లు విడివిడిగా హైదరాబాద్ కి వచ్చారు. ముందుగా ఎన్టీఆర్ అమెరికానుండి హైదరాబాద్ కి సింగిల్ గా రాగా.. తర్వాత రెండు రోజులకి రాజమౌళి, కీరవాణి ఫామిలీస్ హైదరాబాద్ లో దిగాయి. ఇక అదే రోజు రామ్ చరణ్ భార్య తో కలిసి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ రాజకీయ ప్రముఖలతో రామ్ చరణ్ భేటీ అవడమే కాదు.. ప్రధాని మోడీని కలవబోతున్నారు.

Advertisement
CJ Advs

అయితే రామ్ చరణ్ ఢిల్లీ ప్రయాణం వెనుక చిరంజీవిగారి హస్తం ఉంది. ఆయనే రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లేలా అక్కడ అమిత్ షా, ప్రధాని మోడీ ఇంకా కొంతమంది కేబినెట్ మంత్రులని కలిసేలా ప్లాన్ చేసి రామ్ చరణ్ ని ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేలా చేసే ప్లాన్ చేసారు. మెగాస్టార్ కి రాజజకీయ అండ ఉంది. అలా కొడుకు చరణ్ కోసం ఢిల్లీ టూర్ ప్లాన్ చేసి ముందుగానే చిరు ఢిల్లీ వెళ్లి.. అక్కడ కొడుకు కోడలికి కావల్సిన ఏర్పాట్లు చేసేసారు. కొడుకు విజయాన్ని దేశమంతా చెప్పుకునేలా చెయ్యడానికి చిరు ముందుండి రామ్ చరణ్ ని నడిపిస్తున్నారు.

ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తున్న రెండు రోజుల కాన్ క్లేవ్ సదస్సుకు రామ్ చరణ్​ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈవెంట్​లో ప్రధాని మోదీతో రామ్ చరణ్​ వేదికను పంచుకోనున్నారు. అందులో భాగంగానే చరణ్​, చిరంజీవి అమిత్ షాను కలిశారు.

మరి ఎన్టీఆర్ వెనుక ఎవరున్నారు. రామ్ చరణ్ వెనుక చిరు ఉండబట్టే.. రామ్ చరణ్ ఇలా ఢిల్లీ మీడియా నుండి.. హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఎన్టీఆర్ కి ఇంతగా ప్లాన్ చేసి ముందుకు నడిపించే వ్యక్తి లేకపోవడం వలనే ఎన్టీఆర్ క్రేజ్ ఎవ్వరికి కనిపించడం లేదు, అటు చూస్తే రామ్ చరణ్ మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాడని ఎన్టీఆర్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.

Behind Ram Charan father is Chiru:

Ram Charan, Chiranjeevi Meet Amit Shah After Oscar Win
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs