తెలుగు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్-కాల భైరవకి ఆస్కార్ వేదికపై తెలుగులో నాటు అంటూ సాంగ్ ని లైవ్ లో పాడే అవకాశం వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అవడంతో కీరవాణి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ లతో పాటుగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్ తదితరులు అమెరికా వెళ్లారు. అయితే తనకి ఆస్కార్ వేదికపై ఈ పాట పాడే అవకాశం రావడానికి కారణం రాజమౌళి, కీరవాణి, ప్రేమ్, కార్తికేయ అంటూ అక్కడ ఎన్టీఆర్-రామ్ చరణ్ పేర్లని కాల భైరవ ప్రస్తావించడం మరిచిపోయాడు.
మరి చరణ్-ఎన్టీఆర్ ఎలా తీసుకున్నారో తెలియదు కానీ.. వాళ్ళ ఫాన్స్ మాత్రం కాల భైరవపై పగబట్టారు. మామూలుగానే మా హీరో గొప్ప అంటే గొప్ప అంటూ కొట్టుకు చచ్చే అభిమానులు.. ఇలాంటి అవమానం తమ హీరోలకి ఎదురైతే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోరు. మా హీరో పేర్లు చెప్పకుండానే మిగతా పేర్లు చెప్పావు, మా హీరోల వలనే ఆస్కార్ వచ్చింది.. అలాంటిది మా హీరోల పేర్లు మర్చిపోతావా అంటూ కాల భైరవని వెంటాడుతున్నారు.
దానితో ఆస్కార్ తో హైదరాబాద్ లోకి కాలు పెట్టిన కొద్ది క్షణాల్లోనే కాల భైరవ చరణ్-ఎన్టీఆర్ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. అసలు నాటు నాటు పాటకి, ఆర్.ఆర్.ఆర్ విజయానికి తారక్ అన్న, చరణ్ అన్నలే కారణం, ఆస్కార్ స్టేజ్ పై పాట పాడే అవకాశం కల్పించిన వారి పేర్లని మత్రమే నేను చెప్పాను.. కానీ ఇది తప్పుగా వెళ్ళినందుకు గాను సారి చెబుతున్న అంటూ కాల భైరవ ఆ స్టార్ హీరోల ఇద్దరి ఫాన్స్ కి కలిపి క్షమాపణలు చెప్పాడు.