Advertisement
Google Ads BL

మహేష్ కోసం రాజమౌళి ఇంటర్నేషనల్ ప్లాన్


పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి నేడు.. వరల్డ్ వైడ్ గా ప్రశంశలు అందుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకుంది. ఏడాది కాలంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ సక్సెస్ తోనే ట్రావెల్ చేస్తూ ఆస్కార్ వరకు తీసుకువచ్చిన రాజమౌళి.. ప్రస్తుతం హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఇక ఆర్.ఆర్.ఆర్ కి సంబందించిన ఆస్కార్ అవార్డుల హడావిడి విదేశాల్లో ముగిసింది. స్వదేశంలో మొదలు కాబోతుంది. పార్టీలు, సన్మానాలు, సత్కారాలు అలాంటివి.

Advertisement
CJ Advs

ఇక రాజమౌళి వచ్చే నెల నుండి మహేష్ తో చెయ్యబోయే స్క్రిప్ట్ పై కూర్చుంటారని తెలుస్తుంది. మే నుండి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేస్తారని, అలాగే నటుల ఎంపిక కూడా చేపడతారని సమాచారం. అయితే రాజమౌళి మహేష్ కోసం ఈసారి హాలీవుడ్ భామని దించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఆర్.ఆర్.ఆర్ కోసం హాలీవుడ్ నుండి ఓవిలియా ని తీసుకొచ్చి ఎన్టీఆర్ సరసన కోర్చోబెట్టిన రాజమౌళి.. మహేష్ కి ఏ దీపికానో తెస్తారని ఎక్స్పెక్ట్ చేసారు. 

కానీ రాజమౌళి ప్లానింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎలాగూ గ్లోబల్ మూవీగా రాజమౌళి-మహేష్ మూవీ ఉంటుంది అని హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేదిలా ఉంటుంది అంటూ రాజమౌళి తండ్రిగారు సెలవిచ్చారు. సో మహేష్ పక్కన ఈసారి బాలీవుడ్ భామ కాదు.. హాలీవుడ్ భామని చూస్తామన్నమాట. రాజమౌళి ప్లాన్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది అంటే ఇదే కదా.!

Rajamouli master plan for Mahesh:

Mahesh to romance Hollywood beauty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs