Advertisement
Google Ads BL

యంగ్ టైగర్‌కి జస్ట్ 20 నిమిషాలు చాలు!


టాలీవుడ్‌లో ఉన్న అద్భుతమైన నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన నటన, పలికే డైలాగ్స్, డ్యాన్స్.. వేటికవే స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. అందుకే టాలీవుడ్‌లో ఆయన తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా భళ్లాల దేవుడు రానా కూడా ఇదే విషయం చెప్పుకొచ్చాడు. 

Advertisement
CJ Advs

దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’.. సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ టైమ్ విక్టరీ వెంకటేష్ కూడా తన ఫ్యామిలీ ఇమేజ్‌ పరిధిని వదిలేసి చేసిన ఈ వెబ్ సిరీస్‌లో బూతులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రానా, వెంకీలు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ను ప్రమోట్ చేసేందుకు రానా దగ్గుబాటి పలు ఛానళ్లకు, మ్యాగ్‌జైన్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రామ్ చరణ్, ప్రభాస్, తారక్, బన్నీ నుంచి ఏదైనా దొంగిలించాలనుకుంటే.. మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్నకు రానా అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. 

ముందుగా రామ్ చరణ్ గురించి చెప్పుకుంటే.. మా వాడికి (రానా, చరణ్ మంచి ఫ్రెండ్స్‌లే) సాయం చేసే గుణం చాలా ఎక్కువ. చరణ్ హార్ట్ అంత గొప్పది. అల్లు అర్జున్ దగ్గర దోచుకోను.. ఇద్దరం కలిసి దోచేస్తాం. ప్రభాస్ విషయానికి వస్తే.. అతను ఫుడ్ ప్రేమికుడు. ఫుడ్ విషయంలో అతని టేస్టే వేరు.. అది దొంగిలిస్తాను. ఎన్టీఆర్ విషయానికి వస్తే.. అతనిలోని భాషా నైపుణ్యాన్ని దొంగిలించాలి. ఏ భాషనైనా జస్ట్ 20 నిమిషాల్లో ఎన్టీఆర్ మాట్లాడేస్తాడు. చైనీస్ భాష అయినా సరే.. 20 నిమిషాల్లో పట్టేస్తాడు.. అంత టాలెంట్ ఉంది అతనిలో.. అని రానా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన హీరోల గురించి రానా చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Daggubati Rana Talks about Tollywood Star Heroes:

Daggubati Rana Revealed about Great Skills in Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs