పద్దతికి మరో పేరు, ట్రెడిషనల్ కి మారు పేరు అన్నట్టుగా చక్కగా ఉండే కీర్తి సురేష్ ఈమధ్యన స్టయిల్ మార్చింది. గ్లామర్ షో మొదలు పెట్టింది. మహానటిలోనే కాదు.. అంతకుముందు నేను శైలజ, నేను లోకల్ లాంటి సినిమాల్లో ట్రెడిషనల్ గా ఆకట్టుకున్న కీర్తి సురేష్ మహానటి బరువు తర్వాత అవకాశాలు తగ్గడంతో గ్లామర్ షో మొదలు పెట్టి.. నాజూగ్గా తయారై ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టింది.
అదే క్రేజ్ తో సర్కారు వారి పాటలో మహేష్ బాబు కి జోడిగా ఛాన్స్ కొట్టేసి.. అందాలు ఆరబోసింది. అయినా ఆమెకి పక్కా కమర్షియల్ హిట్ తగల్లేదు. ఇప్పుడు కూడా నాని తో దసరాలో కనిపించిన కీర్తి సురేష్ డీ గ్లామర్ గా కనిపించనుంది. సినిమాలో ఎలా ఉన్నా.. దసరా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ మాత్రం గ్లామర్ డాల్ లా మారిపోయి అందాలను తెగ చూపించేస్తుంది.
తాజాగా కీర్తి సురేష్ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బోల్డ్ అనే క్యాప్షన్ పెట్టింది. లాంగ్ ఫ్రాక్ లో కీర్తి సురేష్ అదిరిపోయే అందాలతో కనిపించింది. డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో మెడలో మోడ్రెన్ నెక్లెస్ తో దర్శనమిచ్చింది. కీర్తి సురేష్ బోల్డ్ లుక్ చూసి హమ్మ కీర్తి నీలో ఇంత మార్పా అంటూ నెటిజెన్స్ షాకవుతున్నారు.