Advertisement
Google Ads BL

కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నా: రానా


హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా వున్నాడు. నెట్ ఫ్లిక్స్ లో తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన రానా నాయుడుని హిందీలో భారీగా ప్రమోట్ చేస్తున్న ఆయన తన కెరీర్ విషయాలే కాదు.. తన హెల్త్ సీక్రెట్స్ ని బయటపెట్టాడు. గతంలోనూ తనకో కన్ను కనిపించదు, కిడ్నీ పాడైంది అని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ విషయాలని మరోసారి షేర్ చేసుకున్నాడు. తన కుడి కన్ను బాగా కనిపించదని.. దాని కోసం చికిత్స తీసుకున్నట్టుగా చెప్పాడు. కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్ గురించి మట్లాడుకునే అతి తక్కువ మందిలో నేను ఒకడిని. చాలామంది ఏదైనా శారీరకంగా ఇబ్బంది పడితే.. దానిని నయం చేసుకోవాలి కానీ.. మానసికంగా ఒత్తిడికి గురవుతూ బాధపడతారు.

Advertisement
CJ Advs

అనారోగ్యం నుండి కోలుకున్నాసరే ఇలా జరిగిందేమిటి అంటూ ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదనేది నా సూచన. నాకు కన్ను మాత్రమే కాదు.. కిడ్నీ కూడా పాడైంది. కిడ్నీ కూడా ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నా.. అంటే నేనొక టెర్మినేటర్ లాంటి వాడిని అంటూ సరదాగా చెప్పిన రానా.. ప్రస్తుతం నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. నేను ఉత్సాహంగానే ఉంటున్నాను.

కానీ మీరెందుకు అనారోగ్యం దగ్గరే ఆగిపోతున్నారు. అనవరసంగా ఆలోచించించి.. మనసు పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళండి అంటూ రానా తాను అనారోగ్యంతో ఎంతగా ఇబ్బందిపడి కోలుకున్నాడో చెప్పాడు.

Rana on undergoing corneal and kidney transplant:

Rana Daggubati suffers from partial blindness; Opens up about his kidney transplant
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs