Advertisement
Google Ads BL

అర్హతలేని సినిమాలంటూ రెహమాన్ కామెంట్స్


ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ ఆస్కార్ అవార్డ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ కేటగిరి సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపిన రెహ్మాన్ తాజాగా యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆస్కార్ కి అర్హతలేని సినిమాలు పంపిస్తున్నారంటూ ఆయన సంచలనంగా మట్లాడారు.

Advertisement
CJ Advs

మన దేశం నుంచి అర్హతలేని సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నారని.. అవి ఇతర సినిమాలతో పోటీపడలేకపోవడం వలనే మనకు ఆస్కార్స్ రావడం లేదని అన్నారు. గుజరాతీ ఫిల్మ్ చల్లో ని ఇండియన్ గవర్నమెంట్ ఆస్కార్ కి పంపగా.. అది అవార్డు గెలుచుకోలేకపోయిందనే విషయం తెలిసిందే. ఇక రెహ్మాన్ మట్లాడుతూ..  మనం ఫారిన్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వారు మన మ్యూజిక్ ని ఎందుకు వినడం లేదని ఆయన ప్రశ్నించారు. 

ఆర్ఆర్ఆర్ ని ఇండియా నుండి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ కు పంపించి ఉంటే.. బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకు మరో ఆస్కార్ వచ్చేదంటూ రెహ్మాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

AR Rahman Feels India Is Sending Wrong Movies For Oscars:

A.R. Rahman: Wrong movies are being sent for the Oscars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs