అమెరికాలో గోల్డెన్ గ్లొబ్ అవార్డ్స్, HCA అవార్డ్స్ అందుకున్న ఆర్.ఆర్.ఆర్ ఇప్పుడు నాటు అంటూ సాంగ్ కి ఏకంగా ఆస్కార్ గెలుచుకోవడం అందరికి పట్టరానంత సంతోషాన్నిచ్చింది. అక్కడ ఆస్కార్ ప్రీ పార్టీ, ఆస్కార్ పోస్ట్ పార్టీ అంటూ ఆర్.ఆర్.ఆర్ టీమ్ హంగామా చేసింది. అమెరికాలో ఆస్కార్ పార్టీలు ముగిసాక.. టీమ్ మొత్తం స్వదేశానికి పయనమవుతుంది. కీరవాణి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, కార్తికేయ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ.. ఇలా మొత్తం అందరూ ఇండియాకి రాబోయే సమయం దగ్గరపడింది.
ఎన్టీఆర్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఆస్కార్ తో ఇండియా అందులోను హైదరాబాద్ లో కాలు పెట్టగానే ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయట. అంతేకాకుండా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ అయినప్పుడు దిల్ రాజు స్పెషల్ గా పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆస్కార్ విజేతగా సగౌవరంగా హైదరాబాద్ కి రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి అదిరిపోయే పార్టీ ఇచ్చేందుకు మెగా ఫ్యామిలీ సిద్దమవుతుంది అనే న్యూస్ వినిపిస్తుంది. మరి మెగాస్టార్ చిరు కొడుకు రామ్ చరణ్ ఆస్కార్ వేడుకలో పాల్గొని వస్తున్నాడు. ఆ సంబరాల్లో చిరు ఏమైనా పార్టీ ఇస్తున్నారేమో తెలియదు.. అయినా ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కానీ ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి మాత్రం ఆస్కార్ పార్టీ అదిరిపోయే లెవల్లో ఉండడం ఖాయమంటున్నారు.