Advertisement
Google Ads BL

ప్రేమలో పడిన షణ్ముఖ్ మాజీ లవర్ దీప్తి


బిగ్ బాస్ ఎవరికి ఎంత మేలు చేసిందో తెలియదు కానీ.. యూట్యూబర్ గా క్రేజీగా నెంబర్ 1 స్థానంలో ఉండే షణ్ముఖ్ జీవితాన్ని సర్వ నాశనం చేసింది. అతనకి బిగ్ బాస్ లో ట్రోఫీ రాకపోగా.. పర్సనల్ లైఫ్ నే కోల్పోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ తో క్రేజ్ సంపాదించుకుందాము, సినిమాలతో బిజీ అవుదామనుకుని బిగ్ బాస్ కి వెళితే అక్కడ సిరి ఫ్రెండ్ షిప్ షణ్ముఖ్ ని ముంచేసింది. బిగ్ బాస్ ట్రోఫీ కోల్పోయి, బయటికి వచ్చాక అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనతో బ్రేకప్ చెప్పించుకోవాల్సి వచ్చింది. 

Advertisement
CJ Advs

ఐదేళ్ల బంధాన్ని బిగ్ బాస్ వలన ఐదు నిమిషాల్లో బ్రేకప్ చేసుకున్న షణ్ముఖ్-దీప్తి సునయనాలు తరవాత ఎవరి కెరీర్ లో వారు బిజీ అవ్వగా.. దీప్తి సునయన వెబ్ సీరీస్, ఇన్స్టా రీల్స్, స్పెషల్ గా గ్లామర్ ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేస్తుంది. షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత సింగిల్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తుంది. తరచూ అదిరిపోయే ఫోజులతో అందాలు చూపిస్తున్న దీప్తి సునయన తాజాగా ప్రేమలో పడినట్లుగా చెప్పి షాకిచ్చింది.

అయితే దీప్తి సునయన ప్రేమించింది మాత్రం అబ్బాయిని కాదండోయ్.. అలాగని అమ్మాయిని అనుకునేరు, దీప్తి సునయన పుస్తకాలతో ప్రేమలో పడినట్లుగా ఓ బుక్ పట్టుకుని మరీ ఫొటోలకి ఫోజులిచ్చింది. అంతేకాకుండా పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫొటోస్ ని దీప్తి సునయన సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అవి ఇట్టే వైరల్ అయ్యాయి.

Shanmukh ex-lover Deepti who fell in love:

Deepthi Sunaina Fall In Love With Learning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs