కొద్దిరోజులుగా ప్రభాస్ హెల్త్ ప్రోబ్లెంస్ తో విదేశాలకి వెళుతున్నారు. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ప్రభాస్ ఫాన్స్ ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. బాహుబలి బరువు తగ్గడానికి ఆయన చేసే వర్కౌట్స్ వలనే ప్రభాస్ ఇలా సిక్ అవుతున్నారంటూ.. దాని కోసమే ఆయన ఇటలీ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అది కాదు జనరల్ హెల్త్ చెకప్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్లారని అంటున్నారు.
అయితే తాజాగా ప్రభాస్ తరుచూ ఇటలీ ఎందుకు వెళుతున్నారో అనేది ఇప్పడు బయటపడింది. ప్రభాస్ అనారోగ్య కారణాలతో ఇటలీకి వెళ్లడం లేదు ఆయన సలార్ షూటింగ్ కోసం ఇటలీ వెళుతున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం 85 శాతం మేర కంప్లీట్ అయ్యిపోయిందని.. ఓ షెడ్యూల్ షూట్ ఇటలీలో ప్లాన్ చేయడంతోనే ప్రభాస్ ఇటలీకి వెళ్లారని అంటున్నారు. సో ఫాన్స్ ఆందోళనపడుతున్నట్లుగా ప్రభాస్ ఆరోగ్యానికి ఏమి అవ్వలేదు.
ఆయన సినిమా షూటింగ్ కోసమే ఇటలీ వెళ్లారనేది రివీల్ అవడంతో ప్రభాస్ ఫాన్స్ ఊపిరి తీసుకుంటున్నారు. ప్రభాస్ హెల్త్ ప్రోబ్లెంస్ తో ప్రాజెక్ట్ K, సలార్ షూటింగ్ కూడా వాయిదాపడతాయని, సలార్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది అంటూ వార్తలు రావడంతో వారు కంగారు పడిపోయారు.