రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హాలీవుడ్ స్టార్స్ సరసన నిల్చుని ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ దక్కించుకోవడం వాళ్ళ ఫాన్స్ ని అస్సలు నిలవనియ్యడం లేదు. గ్లోబల్ స్టార్స్ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ ఈ హీరోలిద్దరిని సోషల్ మీడియాలో అదే పనిగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే నాటు నాటు అంటూ తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఇంకా కాల భైరవ అక్కడ ఆస్కార్ వేదికపై లైవ్ పెరఫార్మెన్స్ ఇచ్చారు. ఆ పాట పాడుతున్నంతసేపు హాలీవుడ్ డాన్సర్స్ నాటు నాటుకి అదిరిపోయే స్టెప్స్ వేశారు.
వాళ్ళ పాటకి వీళ్ళ ఆట చూసి ఆస్కార్ కి హాజరైన ప్రముఖులు కొట్టిన క్లాప్స్ కి ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. నిజంగా ఆస్కార్ వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ గనక నాటు నాటు సాంగ్ కి లైవ్ లో డాన్స్ చేసినట్లయితే ఎన్టీఆర్-చరణ్ పేరు మరింతగా మార్మోగిపోయేది. కానీ ఎన్టీఆర్-చరణ్ లు ఆస్కార్ గ్యాలరీకే పరిమితమయ్యారు. అయితే ఎన్టీఆర్ ని హాలివుడ్ మీడియా అడిగింది. మీరు ఆస్కార్ వేదికపై నాటు నాటు డాన్స్ చేస్తున్నారా అని.
ఎన్టీఆర్ మాత్రం నాటు నాటు సాంగ్ కి డాన్స్ చెయ్యడం లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ ప్రాక్టీస్ లేదు.. అందుకే లైవ్ పెరఫార్మెన్స్ నేను కానీ చరణ్ కానీ చెయ్యడం లేదని చెప్పాడు. అదే గనక ఆ సాంగ్ కి ఎన్టీఆర్-చరణ్ డాన్స్ చేస్తే.. ఆస్కార్ వచ్చినందుకు నాటు నాటు మరింత కలర్ ఫుల్ గా మారడం అటుంచి ఎన్టీఆర్-రామ్ చరణ్ లని హాలీవుడ్ స్టార్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేవారు. అంటూ ఇప్పుడు అభిమానులు ఫీలవుతున్నారు.
మరి సినిమాలో అంటే ఇలాంటి కష్టమైన సాంగ్ చెయ్యడానికి టేక్స్ తీసుకునేవాళ్ళు. కానీ లైవ్ లో అలా కుదరదు.. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. అది మిస్ అయితే నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది. అందుకే ఎన్టీఆర్-రామ్ చరణ్ ఆ సాంగ్ విషయాన్ని లైట్ తీసుకుని ఉంటారు.