ప్రభాస్ ఈమధ్యన తరుచూ అనారోగ్యానికి గురి కావడం ఆయన అభిమానులని కలవరపరుస్తుంది. సంక్రాంతి తర్వాత ఒకసారి జ్వరం వచ్చి ఓ పది రోజులపాటు రెస్ట్ తీసుకున్న ప్రభాస్ రీసెంట్ గా అనారోగ్యం కారణంగా ఇటలీ వెళ్లడం ఆయన ఫాన్స్ ని మరింతగా భయపెడుతుంది. అసలే పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ అన్నీ చివరి దశలో ఉన్న సమయంలో ప్రభాస్ ఇలా సిక్ అవడం వాళ్ళని అయోమయానికి గురి చేస్తుంది ప్రభాస్ తాజాగా ఇటలీ వెళ్ళింది కూడా జనరల్ హెల్త్ చెకప్ కోసమే అంటున్నారు.
అయినా ప్రభాస్ ఇలా ఉన్నట్టుండి అనారోగ్యం పాలవడానికి కారణం ఆయన బాహుబలి తర్వాత బరువు తగ్గేందుకు చేసిన కసరత్తులేనట. అందువలనే ఇలా తరుచూ అనారోగ్యం పాలవుతున్నాడని, ఆదిపురుష్ షూటింగ్ ఫినిష్ కాగానే ప్రభాస్ గత ఏడాది మే లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ సమయంలో ఆయన సరిగా నడవలేకపోయాడు కూడా. అది పూర్తిగా నయం కాకుండానే సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ లో పాల్గొనడం ఇప్పుడు మరింత ఇబ్బంది పడేలా చేసినట్లుగా తెలుస్తుంది.
అలాగే బరువు పెరగడం, తగ్గడం చేసిన కారణంగా ప్రభాస్ ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కుంటున్నాడని, అందుకే ఇలా తరచూ ఇటలీకి హెల్త్ చెకప్స్ కోసమే వెళుతున్నాడని.. ఇప్పుడు ఆ ప్రభావం షూటింగ్ చివరి దశలో ఉన్న సలార్, ప్రాజెక్టు K లపై పడే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సలార్ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు లేకపోలేదనే న్యూస్ చూసి ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ ఆరోగ్యంపై మరింతగా ఆందోళన పడుతున్నారు.