Advertisement
Google Ads BL

హీరోయిన్ సూయిసైడ్ లెటర్


పాయల్ ఘోష్ తెలుగులో అడపాదడపా కనిపించి తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ కేరెక్టర్స్ చేసినా పెద్ద ఫేమ్ రాని ఆమె ఆఖరికి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడాని అక్కడికి వెళ్ళింది. అక్కడ కూడా ఆమెకి అవకాశాలు రాక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన పాయల్ ఘోష్ ఎన్టీఆర్ ని విమర్శించే వాళ్ళ భరతం పడుతుంది. అందులో భాగంగానే పాయల్ ఘోష్ ఎన్టీఆర్ అండ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంపై వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. 

Advertisement
CJ Advs

జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని 2020 లోనే చెప్పాను, ఆస్కార్ రాకముందే ఈ విషయాన్ని నేను అంచనా వేసాను. నేను చెప్పింది ఎప్పుడూ అబద్దం అవదంటూ పాయల్ ఘోష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. 

దానితో ఆగకుండా పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో సూయిసైడ్ నోట్ కూడా పోస్ట్ చేసింది. ఒక వేళ నాకు గుండెపోటు వచ్చినా.. లేదంటే నేను ఆత్మ హత్య చేసుకున్నా దానికి కారణం ఎవరంటే.. అంటూ ఆపేసిన లెటర్ ఒకటి పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజెన్స్ ఏమైంది పాయల్ నీకు. అంతా ఓకె నా.. లేదంటే మానసికంగా ఏమైనా బాధపడుతుంటే.. ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు పక్కన పెట్టి ముందు మానసిక వైద్యులని సంప్రదించు అంటూ సలహాలు ఇస్తున్నారు. 

Heroine Suicide Letter:

Actress Payal Ghosh shares unfinished suicide note
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs