తెలుగమ్మాయి అంజలి తమిళంలో సెటిల్ అయ్యి సినిమాలు చేస్తూ ఈమధ్యనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఆమెకి బ్రేక్ ఇచ్చే సినిమాలు తగిలినా.. హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తూనే వెబ్ సీరీస్ లు చేస్తున్న అంజలి గతంలో హీరో జై ని ప్రేమించి పెళ్లి చేసుకోవానుకుంది. కానీ జై తో అంజలి కి మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చేసుకుంది తర్వాత బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారై గ్లామర్ షో మొదలు పెట్టింది.
అయినా అంజలికి ఆశించిన అవకాశాలు రాలేదు. మొన్నామధ్యన అంజలి పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారం జరిగినా అది రూమర్ అంటూ ఆమె కొట్టిపారేసింది. తాజగా అంజలి పెళ్లి మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంజలి గతంలో వ్యక్తిగత కారణాలు, కుటుంబ విభేదాలతోను ఎప్పుడూ న్యూస్ లో నిలిచేది. ప్రస్తుతం అంజలి శంకర్ - చరణ్ RC15 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం పూర్తికాగానే తరువాత అంజలి పెళ్లి చేసుకోబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అంజలికి తన కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు తొలిగిపోవడంతో ఇప్పుడు వాళ్లు అంజలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మళ్ళీ అంజలి పెళ్లి రూమర్ గా నిలిచిపోతుందా.. లేదంటే ఈసారైనా నిజంగానే జరిగిపోతుందా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. చూద్దాం అంజలి పెళ్లి వార్త నిజమో కాదో అనేది.