యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లి అక్కడ ఆస్కార్ వేడుకల్లో, ఆస్కార్ ప్రీ పార్టీ, హాలీవుడ్ మీడియా ఇంటర్వూస్, హాలీవుడ్ స్టార్స్ తో ఫోటో గ్రాఫ్స్, రాజమౌళి ఆస్కార్ పార్టీ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ రోజు బుధవారం తెల్లవారుఝామున 3 గంటలకి ఎన్టీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఆయన కోసం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన అభిమానుల కోలాహలం కనిపించింది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ హైదరాబాద్ లో కాలు పెట్టడమే ఆయనకి ఘన స్వాగతం దక్కింది.
ఎన్టీఆర్ మట్లాడుతూ ఆస్కార్ వేదికపై ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అందుకోవడానికి మించిన ఆనందం మరొకటి లేదనిపించింది. మమ్మల్ని ఎక్కడివరకు తీసుకువెళ్లిన అభిమానులకి, ప్రజలకి ధన్యవాదాలు. జక్కన్న చేతిలో ఆస్కార్ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలిలో మొదటిగా నా భార్య ప్రణతికి ఫోన్ చేసి షేర్ చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ని ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి ఆయన భార్య లక్ష్మి ప్రణతి వచ్చారు. ఆమె కారులో ఉండగా.. ఎన్టీఆర్ కారు ఎక్కివెళ్లిన దృశ్యాలు, అభిమానులకి అభివాదం చేస్తూ విజయ గర్వంతో కనిపిస్తున్న ఎన్టీఆర్ ని చూసిన ఫాన్స్ అస్సలు ఆగడం లేదు. తెల్లవారు ఝామునే నీ కోసం అంత జనం ఏమిటన్నా అంటూ ఫాన్స్ హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్ కి జన నీరాజనాలు, స్పెషల్ వెల్ కమ్ అంటూ నానా హంగామా చేసారు. ఇక ఎన్టీఆర్ అమెరికా నుండి హడావిడిగా వచ్చెయ్యడానికి కారణం ఉంది.
ఎన్టీఆర్-కొరటాల కలయికలో NTR30 ముహూర్తానికి సమయం దగ్గరపడడంతో ఎన్టీఆర్ చాలా త్వరగా అమెరికా ట్రిప్ ముంగించేసారు. ఇక ఎన్టీఆర్ అటు HCA అవార్డ్స్ వేడుకల్లో కూడా పాల్గొనలేకపోయారు. ఎన్టీఆర్ వ్యక్తిగతకారణాలతో వాటికి దూరంగా ఉన్నా ఆస్కార్ వేడుకలకి ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో జాయిన్ అయ్యి తన క్రేజ్ ని ప్రపంచానికి చాటారు.