Advertisement
Google Ads BL

కాజల్ పై మెగా ఫాన్స్ ఫైర్


మెగా ఫాన్స్ కి కాజల్ పై కోపం వచ్చింది. మగధీర లో తనకి అంత పెద్ద అవకాశం ఇచ్చి.. అంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన రాజమౌళిని, రామ్ చరణ్ ని కాజల్ అవమానించడం వాళ్ళకి బొత్తిగా నచ్చలేదు. అసలు కాజల్ పై మెగా ఫాన్స్ ఆగ్రహానికి కారణం ఏమిటి అంటే.. నిన్న సోమవారం ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. దానితో ఆర్.ఆర్.ఆర్ టీంలోని వారిని పేరు పేరునా పొగుడుతూ సినీ సెలబ్రిటీస్ వాళ్ళకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేసారు. అలా కాజల్ అగర్వాల్ కూడా ఓ రెండు ట్వీట్స్ వేసింది.

Advertisement
CJ Advs

ముందుగా Big congratulations!!! Made us all beam with pride ❤️ అంటూ ఎన్టీఆర్ ని స్పెషల్ గా కాంగ్రాక్చులేట్ చేస్తూ ఆస్కార్ తో ఎన్టీఆర్ ఫోటో కి ఫోజిచ్చిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ట్వీట్ లో Big congratulations!!! Made us all beam with pride 🙌🏻❤️  @ssrajamouli @mmkeeravaani @tarak9999 @AlwaysRamCharan #RRR #NaatuNaatu #RRRForOscars #Oscar2023 #Oscars #NaatuNaatuForOscars అంటూ టీమ్ మొత్తాన్ని ఒక్క ట్వీట్ తో కవర్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పింది. ఎన్టీఆర్ తో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత ఫ్రెండ్ అయినా.. తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చరణ్ ని అలా ట్రీట్ చెయ్యడం మెగా ఫాన్స్ కి బొత్తిగా నచ్చలేదు.

మరి కాజల్ ఎందుకలా చేసిందో ఎవరికీ అర్ధం కాకపోయినా.. కాజల్ కూడా కాస్త కునుకు వహించే చరణ్ కి ఇలా చేసింది అనే వాళ్ళు లేకపోలేదు. రామ్ చరణ్ కోసం ఆచార్య లో తనకి రాల్సిన క్రెడిట్ పోయింది. కాజల్ ఆచార్యలో నటించిన సీన్స్ ఎత్తేసి రామ్ చరణ్ పాత్ర పెంచేసి.. కాజల్ ని పూర్తిగా ఆచార్య నుండి తప్పించి అవమానించడం వలనే కాజల్ ఇలా చేసింది అనేవాళ్లూ ఉన్నారు.

Mega fans fire on Kajal:

Kajal special congratulations tweet on NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs