Advertisement
Google Ads BL

ఫైనల్లీ బెల్లంకొండ వస్తున్నాడు


బెల్లంకొండ శ్రీనివాస్ గత మూడేళ్ళుగా వినిపించని పేరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ అంటూ స్టయిల్ గా ఫొటోస్ దిగి షేర్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఈమధ్యన అంతగా వినిపించడమే లేదు. ఎందుకంటే బెల్లకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాలని పక్కనబెట్టి హిందీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అది కూడా రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఛత్రపతి రీమేక్ తో బెల్లకొండ శ్రీనివాస్ హిందీలోకి ఎంటర్ అవుతున్నాడు. వి వి వినాయక్ దర్శకత్వంలో బెల్లకొండ బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

అందుకే బెల్లకొండ శ్రీనివాస్ పేరు ఇక్కడ వినిపించనిది. ఎక్కువగా ముంబై కి వెళ్లి వస్తున్న బెల్లంకొండ ఛత్రపతి షూటింగ్ ప్రోగ్రెస్ కానీ, ఆ సినిమాకి సంబందించిన ఏ చిన్న అప్ డేట్ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అసలు ఆ సినిమా ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో కూడా తెలియని అయోమయంలో అభిమానులు ఉన్నారు. ఇటు చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా నెమ్మదిగా టాలీవుడ్ లో జెండా పాతుతున్నాడు. 

శ్రీనివాస్ హిందీ డెబ్యూ ఛత్రపతి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మే 5 న శ్రీనివాస్ నటిస్తున్న ఛత్రపతి రీమేక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. మే 5 న ఛత్రపతి రీమేక్ రిలీజ్ చేస్తారని.. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా టాక్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇవ్వడమే పోస్ట్ ప్రొడక్షన్ కి రెడీ అయ్యి ప్రమోషన్స్ మొదలు పెట్టేస్తుందట.

Finally Bellamkonda is coming:

Bellamkonda Srinivas Hindi debut release date locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs