హీరోయిన్ మీనా చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మనవరాలు, కూతురు పాత్రలతో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. తర్వాత హీరోయిన్ గా ఎంటర్ అయ్యి అప్పట్లోని స్టార్ హీరోలందరితో అంటే చిరు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీని రూల్ చేసింది. అయితే 2009 లో విద్యా సాగర్ ని ప్రేమ వివాహం చేసుకున్న మీనాకి గత ఏడాది భర్త మరణం తీరని శోకం మిగిల్చింది.
మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్ను ముయ్యగా.. ఆమె కొద్దిరోజులు ఆ శోకంలోనే మునిగిపోయి.. తర్వాత మెల్లగా కోలుకుని మళ్ళీ కెరీర్ వైపు నడిచింది. ఈ ఏడాదికి మీనా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆమెకి తమిళనాట ఘన సన్మానం జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్, రాధిక, రోజాలాంటి నటులు ఈ కార్యక్రమానికి హాజరై మీనాని సత్కరించారు. అయితే ప్రస్తుతం తన కెరీర్ 40 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో తమిళ మీడియాకి ఇంటర్వూస్ ఇస్తుంది.
ఆ ఇంటర్వూస్ లో మీనా తన మనసులోని ఇష్టాలని, తనకి ఏ హీరో అంటే క్రష్ అనే విషయాలను బయటపెట్టింది. తనకి పెళ్ళికి ముందు బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని, పెళ్లి చేసుకుంటే అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకున్నాను, అదే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పాను. అంటూ తనకి హ్రితిక్ అంటే క్రష్ అన్న విషయాన్ని మీనా బయటపెట్టింది. హ్రితిక్ ని చాలా ప్రేమించాను, నాకు పెళ్లి చేస్తాను అంటున్న అమ్మతో అదే విషయాన్ని చెప్పాను.
హ్రితిక్ లాంటి అబ్బాయి కావాలి అని. హ్రితిక్ పెళ్లి రోజు నా హృదయం ముక్కలైంది. ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. అందుకే హ్రితిక్ రోషన్ పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే నా గుండె పగిలినంతపనయ్యింది అంటూ మీనా చెప్పుకొచ్చింది.