Advertisement
Google Ads BL

బాలయ్య హెల్ప్ పై తారకరత్న వైఫ్ అలేఖ్య పోస్ట్


నందమూరి తారకరత్న మరణించి ఒక నెల కావొస్తుంది. అంతకుముందే 23 రోజులపాటు తారకలరత్న ప్రాణాలతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించిన విషయం తెలిసిందే. అయితే అన్న కొడుకు తారకరత్న హార్ట్ ఎటాక్ కి గురై ఆసుపత్రిలో చేరినప్పటినుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న పక్కనే ఉండి.. అయన మరణించిన తర్వాత అంత్యక్రియలు, అలాగే చిన్న కర్మ, పెద్ద కర్మ బాధ్యతలన్నీ అన్న మోహన్ కృష్ణ చేత నిర్వహించేవరకు అన్నీ తానై తారకరత్న కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ విషయంలో నందమూరి అభిమానుల హృదయాలకు బాలయ్య మరింతగా దగ్గరయ్యారు.

Advertisement
CJ Advs

తారకరత్నకి బాలకృష్ణ కి ఎంతగా బాండింగ్ ఉందో.. ఈ సందర్భంలో అందరికి తెలిసింది. నందమూరి కుటుంబం ఎలా ఉన్నా.. తారకరత్నని బాలయ్య దగ్గరికి తీశారు. ఇక తారకరత్న మరణించి నెల రోజులు పూర్తవుతున్న తరుణంలో అలేఖ్య రెడ్డి తన చిన్న మామ బాలకృష్ణ తమ ఫ్యామిలీకి ఎంతగా తోడు నీడగా నిలిచారో అనేది ఓ పోస్ట్ లో తెలియజేసింది. మనకి కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి.. మంచి, చేడు అది ఏ సందర్భం ఆయినా కానీ.. అవి పూర్తిగా సమసిపోయే వరకు రాయిలా మాకు అడ్డు నిలబడ్డ వ్యక్తి, నిన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లే వేళ తండ్రిలా, నీ బెడ్‌ పక్కనే కూర్చొని నీ కోసం పాటు పడినప్పుడు అమ్మలా, నిన్ను నవ్వించడం కోసం జోక్‌లు వేస్తూ.. ఎవరూ చూడనప్పుడు నీ కోసం కన్నీరు పెట్టుకున్న బాంధవుడు.. ప్రతి సమయంలో ఆయన మన వెంటే ఉన్నారు.

నీవు మరి కొన్నాళ్ళు మాతో ఉండి ఉంటే బాగుండేది ఓబు(తారకరత్న).. నేను, మన బిడ్డలు నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. ఒరిజనల్‌ ఫొటోలో ఓబు(తారకరత్న) ని మార్ఫింగ్‌ చేసిన వాళ్లుకు నా ధన్యవాదాలు. వారు చేసిన ఎడిటింగ్‌ ఎంతో అందంగా ఉంది. అంటూ బాలకృష్ణ తో తన భర్త తారకరత్న బిడ్డలు ఉన్న పిక్ ని అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన నందమూరి అభిమానులు.. అలేఖ్య తన కుటుంబానికి బాలయ్య చేసిన మేలుని మరిచిపోకుండా బాలయ్యని అంతలా పొగడడం నిజంగా ఆమె గొప్ప మనసుకి నిదర్శనం.

భర్త మరణంతో ఎంతో కుంగిపోతున్న అలేఖ్యకు బాలయ్య తో పాటు మేమూ ఎప్పటికీ తోడుగా నిలుస్తాము.. మీరు స్ట్రాంగ్ గా ఉండండి అలేఖ్యా అంటూ సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

Taraka Ratna wife Alekhya post on Balayya Help:

Taraka Ratna wife pens emotional note on Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs