Advertisement
Google Ads BL

రీ ఎంట్రీ కోసమే ఇదంతా చేస్తుందా?


20 ఏళ్ళ క్రితం నటనకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన లయ.. పెళ్లి తర్వాత ఇద్దరి బిడ్డలకి తల్లయినప్పటికీ.. అప్పట్లో అంటే 20 ఏళ్ళ క్రితం ఎంత అందంగా, నాజూగ్గా ఉందో ఇప్పటికి అదే అందాన్ని మెయింటింగ్ చేస్తూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టా రీల్స్ తో అదరగొట్టేస్తుంది. అలాంటి లయ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

కారణం లయ అమెరికా నుండి ఇండియాకి వచ్చాక వరసగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇవ్వడమే కాదు.. తన అమెరికా లైఫ్ ని, ఆమెకున్న కోట్ల డబ్బు గురించి, అలాగే భర్త ఎంత పెద్ద డాక్టర్..అమెరికాలో తాను చేసే పనులని అన్నిటినీ చెబుతున్న లయ.. ఉన్నట్టుండి ఇలా హడావిడి చేయడంపై ఇప్పుడు అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అంటే సినిమా ప్రెస్ మీట్స్ లో, అలాగే సినిమా ఫంక్షన్స్ లోను కనబడుతున్న ఆమె.. ఏదో పెద్ద ప్లాన్ లో ఉంది అంటున్నారు.

మరోసారి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ ఏమైనా లయకి ఉందేమో అందుకే సడన్ గా ఇలా బిజీగా కనబడుతుంది అంటున్నారు. ఈ 20 ఏళ్లలో ఎన్నోసార్లు ఇండియాకి వచ్చినా.. ఎప్పుడూ ఇలాంటి హడావిడి చెయ్యలేదు. కానీ ఇప్పుడే ఎందుకిలా అనేది వాళ్ళ అనుమానాలు.

నిజంగా లయ రీ ఎంట్రీ ప్లాన్స్ లో భాగంగానే ఇలా చేస్తుందా? అమ్మ, అక్క పాత్రలకి ట్రై చేస్తుందేమో.. ఎందుకంటే ఎంత డబ్బున్నా.. తనకి తన మనసుకి నచ్చిన పని చేస్తేనే అందులో సంతోషం ఉంటుంది అంటూ లయ యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వూలలో చెబుతుంది.. అందుకే ఈ అనుసమానాలు.

Is it all for re-entry?:

Actress Laya Re Entry?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs