Advertisement
Google Ads BL

రాజమౌళి-మహేష్: ఓపెనింగ్ తోనే బ్లాస్టింగ్


ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ గెలుచుకున్న రాజమౌళిపై క్రేజ్ మాత్రమే కాదు.. అంతకుమించిన అంచనాలు కూడా ప్రేక్షకులు పెట్టుకుంటున్నారు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తెలుగు సినిమా ఘనతని ప్రపంచ పటంలోకి ఎక్కించిన రాజమౌళి నుండి ఇకపై రాబోయే చిత్రాలు ఎలా ఉంటాయి,. ఎలా ఉండబోతున్నాయి అనేది ఎవ్వరూ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇకపై రాజమౌళి సినిమాలన్నీ గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యే సినిమాలే. ఆ రకమైన బడ్జెట్ తోనే రాజమౌళి సినిమాలు ఇకపై ఉండబోతున్నాయనేది స్పష్టం.

Advertisement
CJ Advs

మరి ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయేది సూపర్ స్టార్ మహేష్ తో. ఇప్పటికే ఇది గ్లోబల్ సినిమాగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చి వదిలారు. ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో మహేష్ ని రాజమౌళి ఎలా చూపించినా అది హాలీవుడ్ కి కూడా కనెక్ట్ అయ్యేలా ఉండడం పక్కా. ఈసారి రాజమౌళి తన సినిమాని మహేష్ తో ఓపెనింగ్ చేసినప్పుడే  సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం పక్కా. SSMB29 ఓపెనింగ్ తోనే బ్లాస్టింగ్ అంటూ మహేష్ ఫాన్స్ అందరికన్నా ఎక్కువ ఉత్సాహ పడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మరి రాజమౌళి ఆస్కార్ ఇప్పుడు మహేష్ ని గ్లోబల్ స్టార్ ని చేస్తుంది. రాజమౌళి-మహేష్ సినిమా మొదలు కాకముందే ఆ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ అవడం మాములు విషయం కాదు. ఇకపై ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సెలెబ్రేషన్స్ లో రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే మూవీపై కూడా మాట్లాడడం అయితే గ్యారెంటీ. 

Rajamouli-Mahesh: Blasting with the opening:

Rajamouli new blast at the box office after RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs