బాలకృష్ణ గత కొద్దిరోజులుగా చాలా స్టైలిష్ గా మారిపోయారు. ఈయన ఎలాంటి లుక్ లో కనిపించినా ఫాన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఆయన విగ్ పై, అలాగే హెయిర్ స్టయిల్ పై, ఇంకా కాస్ట్యూమ్స్ పై అభిమానులకే చాలా కంప్లైంట్స్ ఉండేవి. కానీ బాలయ్య చిన్న కుమార్తె తేజస్వి బాలయ్య ని అందమైన హీరోగానే కాదు.. అద్భుతమైన స్టయిల్ లోకి మార్చేసింది. బాలయ్యని ఏ కాస్ట్యూమ్స్ లో చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారో అనేది తేజస్వి పర్ఫెక్ట్ గా పట్టేసింది.
సినిమాల్లోనే కాదు.. అన్ స్టాపబుల్ టాక్ షో లో బాలయ్య స్టయిల్ కి, ఆయన కాస్ట్యూమ్స్ కి, అలాగే విగ్ అందరికి తెగ నచ్చేసింది. మునుపెన్నడూ చూడని బాలయ్యని చూస్తున్నామన్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ మరో కొత్త అవతారం ఎత్తారు. అది కూడా ఆహా ఓటిటి కోసమే. తెలుగు ఇండియన్ ఐడల్ 2 లో గలా విత్ బాల అంటూ బాలకృష్ణ న్యూ అవతార్ లో ఎంటర్ అయ్యారు. అదిరిపోయే హెయిర్ స్టయిల్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని.. కొద్దిగా నెరిసిన గెడ్డంతో బ్లాక్ కాస్ట్యూమ్స్ లో కొత్తగా అంటే యంగ్ స్టర్ లుక్ లో కనిపించి మెస్మరైజ్ చేసారు.
ఇంతకుముందెన్నడూ చూడని బాలయ్యని చూస్తారు అంటూ బాలయ్య కొత్త గెటప్ పిక్స్ ని ఆహా టీమ్ రిలీజ్ చెయ్యగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో నటిస్తున్నారు. ఆ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.