Advertisement
Google Ads BL

ఇది ఆరంభం మాత్రమే: చిరంజీవి


ప్రతి ఒక్కరూ గర్వపడే క్షణమిదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న సందర్భంగా చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారణమైన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిణ్, ఎన్టీఆర్, చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లకు ఆయన అభినందనలు తెలియజేశారు. 

Advertisement
CJ Advs

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజంగా ఇది తెలుగు వారు గర్వపడే క్షణం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చరిత్రాత్మకమైన కీర్తిని తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని గట్టిగా మనసులో ఉంది. కానీ అనౌన్స్‌మెంట్ చేసే వరకు ఎంత ఉత్కంఠగా వేచి చూశాను. ఇంత కష్టపడ్డారు మనవాళ్లు. చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమో అని లాస్ట్ మినిట్ వరకు నాకు టెన్షన్‌గానే ఉంది. నిజంగా ఇది జెన్యూన్ అవార్డ్. 

నేను చాలా సార్లు చెప్పాను. తెలుగు సినిమాకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని. చాలా మంచి సినిమాలు మన ఇండస్ట్రీలో రూపుదిద్దుకున్నాయి. కానీ వేటికి గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేశారు. దేశమే కాదు, ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చిన రాజమౌళికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా అందరం గర్వపడే మూమెంట్ ఇది. ఈ అవార్డ్‌తో మన ఇండస్ట్రీ మరింత బాధ్యతగా, స్టాండర్ట్స్ పెంచుకునేలా.. తర్వాత చేయబోయే చిత్రాలకు ఊతంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. 

అవార్డు వేడుకకు వెళ్లే ముందు రామ్ చరణ్, ఉపాసన నాకు ఫోన్ చేసి బ్లెసింగ్స్ తీసుకున్నారు. ఖచ్చితంగా అవార్డ్ మనకే వస్తుందని వారికి చెప్పాను. నా బిడ్డ నాకంటే పై స్థాయిలో పేరు తెచ్చుకుంటుంటే.. చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డ్‌లో నా బిడ్డ కూడా భాగమైనందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఈ అవార్డ్ ఆరంభం మాత్రమే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందు ముందు మరిన్ని ఆస్కార్ అవార్డులు అందుకునేందుకు రాజమౌళి వేసిన బాట ఇది అని చిరంజీవి తన సంతోషాన్ని తెలియపర్చారు.

It is just beginning says Mega Star Chiranjeevi:

Mega Star Chiranjeevi Very Happy with RRR Gots OSCAR Award
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs